నామినేషన్ వేసి అవసరమైతే జైలుకు వెళ్తామయ్య.. రిపోర్టర్ కి పేర్ని నాని అదిరిపోయే రిప్లై
Breaking News
ది ప్యారడైజ్ ప్రీమియర్ షో.. టికెట్ ధర ఎంతంటే?
Published on Sun, 09/20/2026 - 19:13
నాని హీరోగా వస్తోన్న లేటేస్ట్ యాక్షన్ మూవీ ది ప్యారడైజ్. మరో నాలుగు రోజుల్లో బిగ్ స్క్రీన్‌పై సందడి చేయనుంది. శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్లో వస్తోన్న ఈ సినిమా కోసం ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ట్రైలర్ లేకుండానే ఈ మూవీ రిలీజ్ చేయడం మరో విశేషం. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ చిత్రం సెప్టెంబర్ 24న థియేటర్లలో సందడి చేయనుంది.
తాజాగా ది ప్యారడైజ్ టీమ్‌కు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఈ మూవీ టికెట్ ధరలను పెంచుకునేందుకు అనుమతినిచ్చింది. సింగిల్ స్క్రీన్‌లో మొదటి నాలుగు రోజులు రూ.48 పెంచుకోవచ్చని తెలిపింది. మల్టీప్లెక్స్‌లో రూ.94 అదనంగా వసూలు చేసేందుకు ఓకే చెప్పింది. ఆ తర్వాత 28వ తేదీ నుంచి అక్టోబరు 3 వరకు సింగిల్ స్క్రీన్స్‌లో రూ.23, మల్టీప్లెక్స్‌ల్లో రూ.45 పెంచుకోవచ్చని వెసులుబాటు కల్పించింది.
అంతేకాకుండా తెలంగాణలో ఈనెల 23న సాయంత్రం 6:30 గంటలకు స్పెషల్ ప్రీమియర్ షోకు కూడా అనుమతి ఇచ్చింది. ఈ ప్రీమియర్ షో టికెట్ ధరను రూ.500గా నిర్ణయించారు. ప్రతి రోజు ఐదు షోలు ప్రదర్శించుకునేందుకు కూడా పర్మిషన్ వచ్చేసింది. ఈ సందర్భంగా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయిస్ వెల్ఫేర్ కమిటీకి చిత్ర నిర్మాణ సంస్థ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినీమాస్ ఎల్ఎల్పీ రూ.కోటి అందజేసింది.
Tags : 1