Breaking News

కలెక్షన్లతో దూసుకెళ్తున్న దసరా.. నాలుగు రోజుల్లో ఎన్ని కోట్లంటే?

Published on Mon, 04/03/2023 - 15:24

నేచురల్ స్టార్ నాని, కీర్తి సురేశ్ జంటగా నటించిన చిత్రం 'దసరా'. ఈ చిత్రాన్ని శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించారు. శ్రీరామనవమి సందర్భంగా మార్చి 30న థియేటర్లలో రిలీజైంది ఈ చిత్రం. విడుదలైన మొదటి రోజు నుంచే కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. తొలి రోజే ఏకంగా నైజాంలో వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి చిత్రాల రికార్డ్‌ను బ్రేక్ చేసింది.

ఈ సినిమా రిలీజైన నాలుగు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 87 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. కలెక్షన్ల పరంగా చూస్తుంటే త్వరలోనే రూ.100 కోట్ల మార్కును చేరుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. దసరా మూవీ ఆదివారం రోజే రూ.16 కోట్ల రూపాయల వసూళ్లు సాధించింది. పలు భాషల్లో విడుదలైన దసరాకు అన్ని వర్గాల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. బాక్సాఫీస్‌ వద్ద ఎలాంటి పోటీ లేకపోవడంతో మరికొన్ని ఇదే జోరు కొనసాగనుంది.

కేవలం మూడు రోజుల్లోనే నైజాం (తెలంగాణ)తో పాటు, ఓవర్సీస్‌లో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించింది.  మరికొన్ని చోట్ల నాలుగో రోజు బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకోవడం విశేషం. తెలంగాణ నేపథ్యంలో సినిమా తెరకెక్కడం.. ఇక్కడి ప్రజలకు ఈ చిత్రం కనెక్ట్ కావడంతో ఇక్కడ వసూళ్లలో దుమ్ము దులుపుతోంది. తెలంగాణలోని సింగరేణి బొగ్గు గనుల నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కించారు. 

Videos

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)