Breaking News

ఫేమస్‌ అవగానే మారిపోతారు.. అలాంటి క్రేజ్‌ నాకొద్దని..: నాని

Published on Wed, 04/30/2025 - 13:54

హీరోహీరోయిన్లు సినిమా కోసం ఎంతైతే కష్టపడుతున్నారో ప్రమోషన్ల కోసం కూడా అంతే కష్టపడుతున్నారు. నాని (Nani), శ్రీనిధి శెట్టి జంటగా నటించిన చిత్రం హిట్‌ 3: ది థర్డ్‌ కేస్‌. ఈ సినిమా రేపు (మే 1న) ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో నాని దేశంలోని ప్రధాన నగరాలను చుట్టేస్తున్నాడు. ఇటీవల ముంబైలో ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నాని తన భయాన్ని బయటపెట్టాడు.

మారిపోతానేమోనని భయం
నాని మాట్లాడుతూ.. పాపులారిటీ పెరిగితే నేనేమైనా మారిపోతానేమో, నన్ను నేను కోల్పోతానేమో అన్న భయం ఉండేది. నా ఆలోచనల్లో, నా ప్రవర్తనలో ఏమైనా మార్పు వస్తుందేమో అన్న అనుమానం కలిగేది. ఎందుకంటే నా చుట్టూ ఉన్న కొందరు నిజంగానే వారి స్థాయి పెరిగేకొద్దీ మారిపోయారు. అయితే ఏళ్లు గడిచేకొద్దీ.. ఫేమ్‌ వచ్చినంతమాత్రాన మనలో మార్పు రాదని తెలుసుకున్నాను. అసలు పాపులారిటీకి, మన వ్యక్తిత్వానికి సంబంధమే లేదని అర్థమైంది. 

రానురానూ అర్థమైంది
మనం ఆ క్రేజ్‌ను ఎంతవరకు కంట్రోల్‌ చేస్తున్నామనేది మన చేతుల్లోనే ఉంటుంది. కొందరేమంటారంటే.. మొన్నటివరకు బాగుండేవాడు, ఇప్పుడు ఫేమస్‌ అవగానే మంచిగా ఉన్నట్లు నటిస్తున్నాడంతే.. అని కామెంట్లు చేస్తుంటారు. నిజానికి పాపులారిటీ మనల్ని మార్చదు. మనమే మారిపోతుంటాం. ఆ ఒక్క విషయం నేను బాగా అర్థం చేసుకున్నాను. అందుకే నన్ను నేను కోల్పోతానేమో అన్న భయం నుంచి బయటపడ్డాను అని చెప్పుకొచ్చాడు.

సినిమా
హిట్‌ 3 సినిమా విషయానికి వస్తే.. హిట్‌ ఫ్రాంచైజీలో వస్తున్న మూడో చిత్రమిది. మొదటి భాగంలో విశ్వక్‌ సేన్‌, రెండో భాగంలో అడివి శేష్‌ పోలీస్‌గా నటించగా ఇప్పుడు మూడో పార్ట్‌లో నాని.. అర్జున్‌ సర్కార్‌ అనే పోలీసాఫీసర్‌గా కనిపించబోతున్నాడు. శ్రీనిధి శెట్టి ఈ చిత్రంతో కథానాయికగా టాలీవుడ్‌కు పరిచయమవుతోంది. మిక్కీ జే మేయర్‌ సంగీతం అందిస్తున్నాడు.

చదవండి: విడాకుల తర్వాత కొత్తిల్లు కొన్న నటి.. 'నేను పేదదాన్ని అని చెప్పానా?

Videos

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

Photos

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)