Breaking News

మనం ఇలా విడిపోతామని ఎప్పుడూ అనుకోలేదు: తారకరత్న భార్య ఎమోషనల్

Published on Tue, 02/18/2025 - 16:02

సరిగ్గా రెండేళ్ల క్రితం టాలీవుడ్ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. టాలీవుడ్ హీరో, నందమూరి తారకరత్న కన్నుమూశారు. ఆయన మరణంతో టాలీవుడ్ ఇండస్ట్రీ దిగ్భ్రాంతికి గురైంది. బెంగళూరులోని ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడి ఆయన చివరికీ కన్నుమూశారు. తారకరత్న మరణంతో ఆయన కుటుంబంతో పాటు రెండు రాష్ట్రాల్లోని నందమూరి ఫ్యాన్స్‌ తీవ్ర విషాదంలో మునిగిపోయారు.  ఫిబ్రవరి 18, 2023న నందమూరి అభిమానుల్లో తీవ్ర విషాదాన్ని నింపింది.

ఇవాళ తారకరత్న వర్ధంతి కావడంతో ఆయన భార్య అలేఖ్యా రెడ్డి ఎమోషనల్ పోస్ట్ చేసింది. తన ముగ్గురు పిల్లలతో కలిసి తారకరత్నకు నివాళులర్పించింది. ఈ ప్రపంచంలో నువ్వు లేని లోటు పూడ్చలేనిదని ఎమోషలైంది. నిన్ను కోల్పోయిన క్షణం కాలం నయం చేయలేని గాయం.. నీ స్థానం ఎప్పటికీ భర్తీ చేయలేనిదని భావోద్వేగానికి గురయ్యారు.  మనం ఎప్పుడూ ఇలా విడిపోవాలని అనుకోలేదు... నువ్వు ఇక్కడ ఉండకపోవచ్చు.. కానీ నీ ఉనికి మా జీవితాల్లో, నువ్వు వదిలి వెళ్లిన కలల్లో వికసిస్తూనే ఉంటుందని రాసుకొచ్చింది. మాటలకు , కాలానికి, జీవితానికి అతీతంగా మేము నిన్ను మిస్ అవుతున్నాం అంటూ అలేఖ్యా రెడ్డి.. తన భర్త తారకరత్నను గుర్తు చేసుకుంది.

(ఇది చదవండి: Taraka Ratna Death: నందమూరి తారకరత్న కన్నుమూత)

నందమూరి కుటుంబం నుంచి 'ఒకటో నంబర్‌ కుర్రాడు'తో నటుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు తారకరత్న. హీరోగానే కాకుండా విలన్‌గానూ ప్రేక్షకుల్ని తారక్ అలరించారు. ఆపై రాజకీయాల్లో రావాలనే ఆశయంతో తొలి అడుగు కూడా వేశారు. కానీ ఊహించని పరిణామాలతో చిన్నవయుసులోనే గుండెపోటుతో తారకరత్న మరణించారు. 

కాగా.. తారకరత్నకు అలేఖ్యరెడ్డితో పెళ్లి కాగా.. వీరికి ముగ్గురు పిల్లలున్నారు. వారిలో పెద్ద కూతురు నిష్క, కవల పిల్లలు తాన్యారామ్, రేయా సంతానం. వీరి పిల్లలకు ఎన్టీఆర్‌ పేరు వచ్చేలా పేర్లు పెట్టారు. మొదట పుట్టిన పాపకు నిష్క అని పేరు పెట్టారు. ఆ తర్వాత ఒక పాప, బాబు కవలలుగా పుట్టారు. వీరికి తాన్యారామ్, రేయా అని పేర్లు పెట్టారు. ఈ ముగ్గురి మొదటి అక్షరాలను కలిపితే తారకరత్న తాతగారు అయిన ఎన్టీఆర్ పేరు వస్తుంది. ఈ ముగ్గురి మొదటి అక్షరాలను కలిపితే ఎన్టీఆర్ పేరు వస్తుంది. ఇంగ్లీష్ అక్షరాలు నిష్క లో మొదటి అక్షరం N, తాన్యారామ్‌లో T, రేయాలో R.. ఇలా ఎన్టీఆర్ పేరు వచ్చేలా ముగ్గురు పిల్లలకు పేర్లు పెట్టారు తారకరత్న.

Videos

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)