Breaking News

నా తమ్ముడు 'తారక్‌' రాజకీయాల్లోకి వస్తాడు: సుహాసిని

Published on Sat, 08/30/2025 - 07:34

నందమూరి హరికృష్ణ (Nandamuri Harikrishna) వర్ధంతి సందర్భంగా ఆయన అభిమానులు పెద్దఎత్తున నివాళులర్పించారు. 2018లో  నల్గొండ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో  హరికృష్ణ మరణించిన విషయం తెలిసిందే. కొద్దిరోజులుగా జూనియర్‌ ఎన్టీఆర్‌ పేరు సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతుంది. అనంతపురం ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ తారక్‌పై చేసిన కామెంట్లతో అభిమానులు భగ్గుమన్నారు. సీఎం చంద్రబాబును కలిసిన ఎమ్మెల్యే ఆ తర్వాత క్షమాపణలు చెప్తారని అందరూ భావించారు. అదీ లేకపోవడంతో వచ్చే ఎన్నికల్లో టీడీపీకి తగిన బుద్ది చెప్తామని తారక్‌ ఫ్యాన్స్‌ వార్నింగ్‌ ఇచ్చారు. సరిగ్గా ఇలాంటి సమయంలోనే ఎన్టీఆర్‌ రాజకీయ ఎంట్రీ గురించి ఆయన సోదరి నందమూరి సుహాసిని క్లారిటీ ఇచ్చారు.

హరికృష్ణకు సుహాసిని నివాళులర్పించారు. ఈ క్రమంలోనే ఎన్టీఆర్‌ రాజకీయ ఎంట్రీ ఎప్పుడు ఉంటుందని మీడియా ప్రశ్నించగా ఆమె ఇలా చెప్పారు. ' ప్రస్తుతం ఎన్టీఆర్‌ సినిమా పనుల్లో పూర్తిగా నిమగ్నమై ఉన్నారు. అవకాశం వచ్చినప్పుడు  తప్పకుండా రాజకీయాల్లోకి వస్తాడు.' అని ఆమె క్లారిటీ ఇచ్చారు.  నందమూరి హరికృష్ణ వారసుడిగా రాజకీయ ఎంట్రీ ఉంటుందా అనే  ప్రశ్నకు ఆమె ఈ సమాధానం చెప్పడం విశేషం. దీంతో తారక్‌ అభిమానులు సంతోషిస్తున్నారు. ఆమె చేసిన వ్యాఖ్యలను నెట్టింట షేర్‌ చేస్తున్నారు.
 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)