Breaking News

'గ్రౌండ్ ఫ్లోర్ బలిసిందా అన్నాడు'.. బాలయ్య కామెంట్స్ వైరల్!

Published on Mon, 10/09/2023 - 09:20

నందమూరి బాలకృష్ణ, కాజల్ జంటగా నటిస్తోన్న చిత్రం భగవంత్ కేసరి. ఈ సినిమాలో పెళ్లిసందడి ఫేమ్ శ్రీలీల ప్రధాన పాత్రలో కనిపించనుంది. ఈ చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. షైన్‌స్క్రీన్స్‌ పతాకంపై సాహు గారపాటి, హరీష్‌ పెద్ది సంయుక్తంగా నిర్మించారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్‌ రిలీజ్‌ ఈవెంట్‌ను హనుమకొండలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దర్శకులు వంశీ పైడిపల్లి, గోపీచంద్‌ మలినేని, బాబీ ముఖ్య అతిథులుగా హాజరై ట్రైలర్‌ని విడుదల చేశారు. అయితే వేడుకలో పాల్గొన్న నందమూరి బాలకృష్ణ తన మాటలతో అందరినీ నవ్వించారు. శ్రీలీలతో హీరోయిన్‌గా చేస్తా అన్నందుకు మోక్షజ్ఞ ఇలా అన్నాడంటూ నవ్వులు పూయించారు. 

(ఇది చదవండి: ‘భగవంత్‌ కేసరి’.. ఈ పేరు చానా ఏళ్లు యాదుంటది)

వేదికపై బాలయ్య మాట్లాడుతూ..' శ్రీలీల నన్ను చిచా, చిచా అని పిలిచి టార్చర్ పెట్టినావ్. నాతో సినిమాలో నటించావ్ సరే. కానీ నెక్ట్స్ సినిమాలో మనిద్దరం హీరో, హీరోయిన్లుగా చేద్దామన్నా. అయితే ఇదే మాటను ఇంటికి వెళ్లి మా వాళ్లతో చెప్పా. మా వాడు మోక్షజ్ఞకు కోపం వచ్చింది. ఏం డాడీ నెక్ట్స్ నేను కుర్ర హీరోను కాబోతున్నా. నువ్వేమో ఆమెకు ఆఫర్‌ ఇస్తావ్. ఏం డాడీ నీకు గ్రౌండ్ ఫ్లోర్ బలిసిందా డాడీ అని అనిండు.' అని అన్నారు. ఈ మాటలకు వేదికపై ఉన్న వారందరు నవ్వారు. అయితే ఇదే డైలాగ్‌ భగవంత్ కేసరిలో ఉంది. గ్రౌండ్ ఫ్లోర్ బలిసిందా బే అంటూ విలన్‌కు వార్నింగ్ ఇస్తాడు. కాగా..  ఈ చిత్రం విజయదశమి సందర్భంగా ఈ నెల 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. 

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)