Breaking News

బాలయ్యా, నీ హీరోయిన్ మద్యం ప్రచారంపై ఏమందో విన్నావా?

Published on Sun, 05/18/2025 - 12:54

ఆయన ఓ ప్రముఖ సినీనటుడు,అంతేకాదు ఓ సీనియర్ రాజకీయ నాయకుడు.. అంతవరకు అయినా పర్లేదేమో కానీ నందమూరి బాలకృష్ణ పద్మ భూషణ్ పురస్కార గ్రహీత కూడా.  అలాంటి నేపథ్యం వున్న బాలకృష్ణ(Nandamuri Balakrishna ) మాన్షన్ హౌస్  మద్యం ద్వారా పేరొందిన బ్రాండ్ కు సంబంధించిన ప్రకటనలో నటించడం వివాదాస్పదంగా మారింది. ఇటీవలే భారత ప్రభుత్వం నుంచి పద్మ భూషణ్ పురస్కారాన్ని అందుకున్న బాలకృష్ణ, అలాంటి గౌరవనీయమైన పురస్కారం పొందిన తర్వాత మద్యం ప్రకటనలో పాల్గొనడం అనుచితమని నెటిజన్లు విమర్శిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా పలువురు బాలకృష్ణను టార్గెట్ చేస్తూ ట్రోలింగ్ చేస్తున్నారు. “పద్మ భూషణ్  పొందిన వ్యక్తి ఇలాంటి వాణిజ్య ప్రకటనలు చేయడం ఎలా అనుమతిస్తారు? అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు

ఇదిలా ఉండగా, బాలకృష్ణ నుంచి దీనిపై ఇప్పటివరకు ఎలాంటి స్పందన రాలేదు. అయితే ఈ వివాదం రాజకీయ వర్గాల్లో కూడా చర్చనీయాంశంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. ఒక ప్రజా ప్రతినిధిగా  ఇలాంటి ప్రకటనల్లో నటించడం బాధ్యత లేనితనమే అని పలువురు అభిప్రాయపడుతున్నారు. బాలకృష్ణ మద్యం యాడ్ వివాదం సామాజిక మాధ్యమాల్లో చర్చలకు గతం లో ని కొన్ని విషయాల ప్రస్తావనకు దారి తీసింది

బాలకృష్ణ ఆ మద్యం బ్రాండ్ పై తన అభిమానాన్ని పదే పదే చాటు కోవడం పై అనేక రకాల విమర్శలు వచ్చాయి, అవేవీ పట్టించుకోకుండా ఇప్పుడు ఏకంగా ఆ బ్రాండ్ ని ప్రమోట్ చేయడo బాలకృష్ణ బరితెగింపు కి నిదర్శనం గా అనిపిస్తోంది.  గతంలో ఈ తరహా మద్యం బ్రాండ్ల ప్రచారంలో సెలబ్రిటీలు పాల్గొనడం పై ఉవ్వెత్తున విమర్శలు రావడం దాంతో అనేకమంది స్టార్స్ ఇక తాము అలాంటి ప్రకటనల్లో కనిపించం అని నిర్ణయం తీసుకోవడాన్నీ పలువురు గుర్తు చేసుకుంటున్నారు.

ఓ కూల్ డ్రింక్ బ్రాండ్ ప్రచారం చేసినందుకే చిరంజీవి పై విమర్శలు రావడం దాంతో అయన వెనక్కి తగ్గడం కూడా గుర్తు చేస్తున్నారు. అంతేకాదు ఒకనాటి బాలకృష్ణ హీరోయిన్, బంగారు బుల్లోడు సినిమా లో అయన సరసన నటించిన రవీనాటండన్(Raveena Tandon) తారల మద్యం ప్రచారం పై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేయడం గమనార్హం. సెలబ్రిటీలుగా తమపై ఎక్కువ సామాజిక బాధ్యత ఉంటుందనీ, ఆల్కహాల్ ఉత్పత్తులకు తాము ప్రచారం చేయడం అంటే యువత ను తప్పుదారి పట్టించడమే అవుతుంది అని ఆమె వ్యాఖ్యనించారు.. మరి బాలయ్య కి ఇలాంటి మంచి మాటలు చెవికెక్కుతాయా... లేక మంచి చెడూ జాంతానై.. మా బ్లడ్డు బ్రీడు సపరేట్ హై.. అంటూ ఇలాగే కంటిన్యూ అయిపోతారా.. దీనికి ఆన్సర్ కోసం  జనం మాత్రమే కాదు ఆయన్ను  వరించిన పద్మ భూషణ్ కూడా ఆశగా ఎదురు చూస్తోంది.

Videos

ఆసియా కప్‌లో దాయాదుల పోరు, భారత్ Vs పాక్ మ్యాచ్.. ఎలా చూడాలంటే..?

సోషల్ మీడియా అకౌంట్లు తొలగింపు బాబు, లోకేష్ పై జగన్ ఫైర్

అమ్మాయి దొరకకపోతే బోనులో నుంచుంటావ్.. DGPకి జస్టిస్ బట్టు దేవానంద్ వార్నింగ్...

స్థానిక ఎన్నికల సమరం.. జేసీకి పెద్దారెడ్డి ఛాలెంజ్

DSC అక్రమాలపై సంచలన నిజాలు బయటపెట్టిన టీడీపీ కార్యకర్త

బస్సు ఘోర ప్రమాదం.. ప్రయాణికులతో పద్మా నదిలోకి దూసుకెళ్లిన బస్సు!

నేపాల్ సహాయక చర్యల్లో మరో మిరాకిల్

దివ్యతేజ మృతిపై అనుమానాలు,స్టేషన్ కు వెళ్లి.. శవమై వచ్చాడా..?

డీఎస్సీ ఉద్యోగాలపై బొత్స బాంబు.. 14-15 లక్షలకు పోస్టులు అమ్ముకున్నారు..!

మీ పాదయాత్రలో పాల్గొంటే DSC ఉద్యోగాలు పంచేస్తారా?

Photos

+5

డీఎస్సీలో అక్రమాలపై వైఎస్సార్‌సీపీ ‘గురు పరిరక్షణ దీక్ష’ (ఫొటోలు)

+5

'తెల్ల కాగితం' సినిమా టీజర్ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ఏడాదిన్నర తర్వాత వస్తున్న వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు