Breaking News

హిట్‌ ఇచ్చిన డైరెక్టర్‌కు మరో ఛాన్స్‌ ఇస్తున్న 'బాలకృష్ణ'

Published on Mon, 04/14/2025 - 07:12

నందమూరి బాలకృష్ణ( Nandamuri Balakrishna) వరుస విజయాలతో స్పీడ్‌ మీదున్నారు. రీసెంట్‌గా డాకు మహారాజ్‌తో విజయాన్ని అందుకున్న ఆయన ఇప్పుడు మరో సినిమాను పట్టాలెక్కించేందుకు రెడీ అయిపోతున్నాడు. అయితే, మాస్‌ సినిమాలకు తనదైన మార్క్‌ చూపించే బాలయ్య ఇప్పుడు మళ్లీ అదే ఫార్ములాను నమ్ముకున్నాడు.  వీర సింహారెడ్డి సినిమాతో తనకు హిట్‌ ఇచ్చిన గోపీచంద్ మలినేని దర్శకత్వంలో కొత్త సినిమాను ఆయన ప్రకటంచనున్నారు. ఈమేరకు ఇద్దరి మధ్య చర్చలు కూడా ముగిశాయని తెలుస్తోంది.

జాట్‌ సినిమాతో బాలీవుడ్‌ ప్రేక్షకులను మెప్పించిన గోపీచంద్ మలినేని మాస్‌ చిత్రాలను తెరకెక్కించడంలో గుర్తింపు తెచ్చుకున్నాడు. దీంతో ఆయనకు హిందీలో కూడా ఆదరణ దక్కింది. క్రాక్, వీర సింహా రెడ్డి , జాట్ ఇలా వరుస చిత్రాలతో జోరు మీదున్న మలినేని మరోసారి బాలయ్యతో సినిమా సెట్‌ చేశాడు.   వృద్ధి సంస్థ బ్యానర్ పై సతీష్ కిలారు ఈ చిత్రాన్ని నిర్మిస్తారని తెలుస్తోంది. ఈ సంస్థ నుంచి ఇప్పటికే రామ్‌ చరణ్‌ పెద్ది సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.

బాలకృష్ణ- బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘అఖండ 2: తాండవం’ దసరా సందర్భంగా సెప్టెంబరు 25న థియేటర్లలోకి రానుంది.  బాలయ్య ఇందులో మురళీ కృష్ణగా, అఖండ రుద్ర సికిందర్‌ అఘోరాగా రెండు పాత్రల్లో కనిపించనున్నారు. ‘అఖండ’కు కొనసాగింపుగా  పాన్‌ ఇండియా రేంజ్‌లో బోయపాటి శ్రీను ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అఖండ సినిమాకు బాలీవుడ్‌లో భారీగానే ఫ్యాన్స్‌ ఉన్నారు. అందుకే ఈ చిత్రాన్ని హిందీలో డైరెక్ట్‌గా విడుదల చేయనున్నారు.   ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమా నుంచి త్వరలో గ్లింప్స్‌ విడుదల కానుంది.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)