Breaking News

నటనకు 50 ఏళ్లు.. బాలకృష‍్ణ పోస్టర్ ఆవిష్కరణ!

Published on Thu, 08/08/2024 - 20:51

తాతమ్మ కల (1974) సినిమాతో నటుడిగా కెరీర్ ప్రారంభించిన హీరో నందమూరి బాలకృష్ణ . ఈ ఏడాదితో ఆయన నటుడిగా యాభైఏళ్లు పూర్తి చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా స్వర్ణోత్సవాన్ని సెప్టెంబరు 1న నిర్వహించేందుకు తెలుగు చలన చిత్ర పరిశ్రమ సన్నాహాలు చేస్తోంది. ఈ వేడుకకు సంబంధించిన కర్టన్‌ రైజర్‌ కార్యక్రమాన్ని బుధవారం హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సినీ ప్రముఖులు పాల్గొన్నారు.  ఈ సందర్భంగా నందమూరి రామకృష్ణ, నందమూరి మోహనకృష్ణలు కలిసి స్వర్ణోత్సవం పోస్టర్‌ను ఆవిష్కరించారు. కాగా.. నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో నటిస్తున్నారు.

దర్శక,నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజా మాట్లాడుతూ.. 'బాలకృష్ణ నటుడిగా 50 ఏళ్లు పూర్తి చేసుకున్నా ఇ‍ప్పటి యంగ్ హీరోలకు ఏమాత్రం తగ్గకుండా పోటీ ఇస్తున్నారు. ఇండియన్ సినిమాలో అమితాబ్ తర్వాత బాలకృష్ణలాగా నటించిన వాళ్లు ఎవరూ లేరు. బాలయ్య స్కూలు వెళ్లేటప్పటి నుంచి ఇప్పుడు కూడా ఒక సామాన్యుడిలా తిరుగుతారు. చాలా సింప్లిసిటీగా ఉంటారు. బాలయ్య నాకు ఇష్టమైన నటుడు. ఆయన 50 వసంతాలు పూర్తి చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఇండస్ట్రీ అంతా కలిసి చేస్తున్న ఈ కార్యక్రమానికి అందరూ వచ్చి విజయవంతం చేయాలి' అని అన్నారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ బోయపాటి శ్రీనివాస్, నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు, సీనియర్ డైరెక్టర్ కోదండరామిరెడ్డి, మాదాలరవి,  నటుడు శివబాలాజీ, దామోదర్ ప్రసాద్, భరత్ భూషణ్, వైవీఎస్ చౌదరి, సీ కల్యాణ్, పరుచూరి గోపాలకృష్ణ, తుమ్మల ప్రసన్నకుమార్ పాల్గొన్నారు.

 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)