Breaking News

సమస్య ఎంత పెద్దదైనా ప్రాణాలు తీసుకోవద్దు: నానా పటేకర్‌

Published on Thu, 10/08/2026 - 09:04

నటుడిగా నానా పటేకర్‌ గురించి అందరికీ తెలిసిందే. ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.  తెరపై ఆయన చెప్పే పవర్‌ఫుల్ డైలాగ్స్‌, పోషించే విభిన్న పాత్రలు ప్రేక్షకులపై చెరగని ముద్ర వేశాయి. అయితే సినిమాలకు అవతల నానా పటేకర్‌లో మరో కోణం ఉందని కొంతమందికే తెలుసు.  దేశ సైనికులంటే ఆయనకు అపారమైన గౌరవం ఉండేది. మరో పక్క రైతుల సమస్యలపై కూడా అంతే స్థాయిలో స్పందించేవారు. నటుడిగా సంపాదించిన గుర్తింపును మించి.. ఓ మనిషిగా తన బాధ్యతను నెరవేర్చేందుకు ఆయన చేసిన ప్రయత్నాలు ప్రత్యేకంగా నిలిచాయి.

కార్గిల్‌ యుద్ధ సమయంలో ఆర్మీతో..
భారత్‌-పాకిస్థాన్‌ మధ్య 1999లో జరిగిన కార్గిల్‌ యుద్ధ సమయంలో నానా పటేకర్‌ ఆర్మీతో కలిసి పనిచేశారు. అప్పటి రక్షణ మంత్రి జార్జ్‌ ఫెర్నాండెజ్‌ అనుమతి తీసుకుని సైనికులతో కలిసి ఉండేందుకు వెళ్లారు. దాదాపు 60 రోజుల పాటు క్విక్‌ రియాక్షన్‌ టీమ్‌తో ఉన్నట్లు నానా పటేకర్‌ స్వయంగా గతంలో తెలిపారు. అంతేకకుండా ఆర్మీపై ఆయనకున్న గౌరవం సినిమాల్లోనూ కనిపించింది. ‘ప్రహార్‌: ది ఫైనల్‌ అటాక్‌’లో ఆర్మీ అధికారి పాత్ర కోసం నానా పటేకర్‌ కఠినమైన సైనిక శిక్షణ తీసుకున్నారు.

(ఇదీ చదవండి: 13 ఏళ్లకే పెళ్లి.. 14 ఏళ్లకే తల్లి.. భర్త వదిలేశారు.. ఈ నటి జీవితంలో..)

రైతుల కోసం ‘నామ్‌ ఫౌండేషన్‌’
నానా పటేకర్‌ జీవితంలో మరో ముఖ్యమైన అధ్యాయం రైతుల కోసం చేసిన సేవ అనే చెప్పాలి.  మహారాష్ట్రలో కరువు, రైతుల ఆత్మహత్యలు, నీటి కొరత వంటి సమస్యలను చూసి చలించిన ఆయన.. నటుడు మకరంద్‌ అనాస్పురేతో కలిసి 2015లో ‘నామ్‌ ఫౌండేషన్‌’ను ప్రారంభించారు.  రైతులకు ఆర్థిక సహాయం అందించడంతో పాటు నీటి సంరక్షణ, గ్రామాల అభివృద్ధి, రైతుల కుటుంబాలకు అండగా నిలవడం వంటి కార్యక్రమాలను ఈ సంస్థ చేపట్టింది. రైతులకు మానసికంగా అండగా ఉండేందుకు నామ్‌ ఫౌండేషన్‌ ద్వారా కార్యక్రమాలు చేపట్టారు. నీటి సంరక్షణ, ఎండిపోయిన బావులను పునరుద్ధరించడం, గ్రామాల్లో నీటి నిర్వహణ వంటి పనులపై కూడా దృష్టి పెట్టారు.  

‘రైతు దేశానికి అన్నం పెడతాడు’..
రైతుల పరిస్థితిపై నానా పటేకర్‌ చాలా సందర్భాల్లో తీవ్రంగా స్పందించారు. 2024లో నాసిక్‌లో జరిగిన రైతు సమావేశంలో మాట్లాడుతూ.. ‘ రైతులు పండించే పంటకు సరైన ధర ఇవ్వాలి.  దేశం మొత్తానికి ఆహారం అందించే రైతుల సమస్యలను పట్టించుకోవాల్సిన అవసరం ఉంది’ అని అన్నారు.  సమస్య ఎంత పెద్దదైనా ప్రాణాలు తీసుకోవద్దని, అందరూ కలిసి పరిస్థితులను మార్చేందుకు ప్రయత్నించాలి’ అని  పిలుపునిచ్చారు.  ఇలా సినిమాలో నటుడిగా కనిపించిన నానా పటేకర్‌.. నిజ జీవితంలో మాత్రం సైనికుడి పట్ల గౌరవం, రైతు పట్ల బాధ్యత ఉన్న మనిషిగా తనదైన ముద్ర వేశారు.

(ఇదీ చదవండి: మాధురీపై మనసు పారేసుకున్న నానా పటేకర్‌..)
 

 

 

Videos

తాడేపల్లి YSRCP పార్టీ ఆఫీస్ కూల్చివేత అంబటి స్టాంగ్ వార్నింగ్

జనసేన MLA చిర్రి బాలరాజు సన్నిహితురాలు సంచలన వీడియో

డార్లింగ్ ఫ్యాన్స్ కు పండగే..! ఫౌజీ నుంచి 3 నిమిషాల టీజర్..

ఏపీలో స్థానిక ఎన్నికలకు SEC రెడీ

Viral: చెన్నైలో షాకింగ్ ఘటన.. రోడ్డుపై భారీ గుంతలోకి దూసుకెళ్లిన కారు

జగ్గారెడ్డి దీక్ష.. రాజీనామా చేసే వరకు నా పోరాటం ఆగదు

సునీత కుటుంబానికి పదవులు? చంద్రబాబు ను కలవడానికి కారణం కూడా.. షాకింగ్ నిజాలు

YSRCP ఎమ్మెల్యే విరుపాక్షికి బెయిల్‌

వెనక్కి తగ్గిన కేంద్రం.. UPI చార్జీలు వాయిదా

YS జగన్ దృష్టిలో BC అంటే బ్యాక్ బోన్ క్లాసెస్

Photos

+5

రణబాలి మూవీ ట్రైలర్‌ లాంఛ్ ఈవెంట్‌లో స్పెషల్ మూమెంట్స్.. (ఫోటోలు)

+5

శ్రీవిష్ణు కామ్రేడ్ కళ్యాణ్ మూవీ ప్రెస్‌మీట్.. (ఫోటోలు)

+5

జిమ్‌లో బిగ్‌బాస్ బ్యూటీ దివి కసరత్తులు చూశారా?.. (ఫోటోలు)

+5

ది ప్యారడైజ్‌ ఏషనాగుల కట్టమీద సాంగ్‌ వర్కింగ్ స్టిల్స్.. (ఫోటోలు)

+5

హీరోయిన్ కామాక్షి భాస్కర్ల లేటెస్ట్ ఫోటోలు

+5

విజయవాడ : విద్యుత్ కాంతులతో వెలిగిపోతున్న ఇంద్రకీలాద్రి (ఫొటోలు)

+5

తల్లికి బంగారు పతకం, తండ్రి, కుమార్తెకు పీజీ డిగ్రీలు (ఫొటోలు)

+5

తెరపై చూసిన నానా కాదు.. ఈ విలక్షణ ఫొటోలు చూడండి!

+5

హైదరాబాద్ : భళా..సరస్‌ మేళా (ఫొటోలు)

+5

హైదరాబాద్ లో సందడి చేసిన సినీ నటి భాగ్యశ్రీ బోర్సే (ఫొటోలు)