Breaking News

సినిమాల్లోకి నమ్రత రీఎంట్రీ? క్లారిటీ ఇచ్చిన హీరోయిన్‌

Published on Thu, 06/09/2022 - 13:12

సూపర్‌ స్టార్‌ మహేశ్‌బాబు భార్య నమ్రత శిరొద్కర్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వంశీ మూవీతో హీరోయిన్‌గా టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చిన ఆమె అదే సమయంలో మహేశ్‌తో ప్రేమలో పడిపోయింది. అంజీ మూవీ తర్వాత మహేశ్‌ను వివాహం చేసుకున్న అనంతరం సినిమాలకు గుడ్‌బై చెప్పింది. అప్పటి నుంచి కుటుంబ బాధ్యతలు, బిజినెస్‌ వ్యవహరాలతో బిజీగా ఉంది. ఇక మహేశ్‌ సినిమా షూటింగ్స్‌తో బిజీగా ఉంటే.. భర్తకు సంబంధించిన వ్యాపారాలు, జీఎమ్‌బీ ప్రొడక్షన్స్‌ వ్యవహరాలతో పాటు పిల్లల బాధ్యతలను నమ్రత చూసుకుంటుంది.

చదవండి: గ్రాండ్‌గా నయన్‌-విఘ్నేశ్‌ల పెళ్లి.. హాజరైన రజనీ, షారుక్‌

అయితే ఆమె సినిమాల్లో నటించకపోయిన అప్పుడప్పుడు భర్త మహేశ్‌తో కలిసి ప్రకటనలో నటించడం, మ్యాగజైన్స్‌ కోసం ఫొటోషూట్స్‌ ఇవ్వడం చేస్తూనే ఉంటుంది. దీంతో ఆమె మళ్లీ తను నటించే అవకాశం ఉందని అందరూ అభిప్రాయ పడుతున్నారు. ఈ క్రమంలో తన రీఎంట్రీపై మరోసారి క్లారిటీ ఇచ్చింది నమ్రత. ఇటీవల తన స్నేహితులు ప్రారంభించి స్టైలింగ్‌ స్టోర్‌ ప్రారంభోత్సవానికి నమ్రత ముఖ్య అతిథిగా హజరైంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పలు ఆసక్తిక విషయాలు పంచుకుంది. మహేశ్‌కు షాపింగ్‌ అంటే అసలు నచ్చదని, ఆయన కోసం కూడా తానే షాపింగ్‌ చేస్తానని చెప్పింది. 

చదవండి: నయన్‌పై విఘ్నేశ్‌ ఎమోషనల్‌ పోస్ట్‌

ఆ తర్వాత సినిమాల్లోకి తన రీఎంట్రీపై స్పందిస్తూ.. ‘తిరిగి నేను సినిమాల్లో నటించాలని చాలా మంది కోరుకుంటున్నారు. కానీ వారందరిని ఎప్పుడు హర్ట్‌ చేస్తూనే ఉన్నాను. ప్రస్తుతం నేను నా కుటుంబ బాధ్యతలను చూసుకోవడం బిజీగా ఉన్నాను. అది నాకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. అందుకే సినిమాలపై దృష్టి పెట్టడం లేదు. నిజానికి మళ్లీ నటించాలనే ఆసక్తి కూడా నాకు లేదు. అందుకే నటించాలనే ఆలోచనే చేయడం లేదు. భవిష్యత్తులో కూడా ఆ ఆలోచన ఉండకపోవచ్చు’ అంటూ నమ్రత క్లారిటీ ఇచ్చింది. దీంతో ఇక నమ్రతను తెరపై చూసే అవకాశం లేదా? అని ఆమె ఫ్యాన్స్‌ నిరాశ వ్యక్తం చేస్తున్నారు.

Videos

మెడికల్ మాఫియా బాగోతం! ఫేక్ డాక్టర్ల మాయాజాలం

ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్ Conflict 2025

Rain Alert: మరో నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు

KTR: నీ కేసులకు భయపడేది లేదు

రేషన్ డోర్ డెలివరీ రద్దుపై వైఎస్ జగన్ రియాక్షన్..

రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి కొండా రాజీవ్

Operation Trashi: టాప్ 6 ఉగ్రవాదులు హతం..

MLAని అని చెప్పుకోవాలంటే సిగ్గుగా ఉంది: Bandaru Satyanarayana

తమిళనాడు లిక్కర్ స్కామ్ కేసు దర్యాప్తుపై సుప్రీంకోర్టు స్టే

పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకున్నాం : ప్రధాని మోదీ

Photos

+5

కొడుకు, చెల్లెలితో సానియా మీర్జా క్యూట్‌ మూమెంట్స్‌ (ఫొటోలు)

+5

Miss World 2025 : శిల్పారామంలో ఆడి పాడుతూ సందడి చేసిన గ్లోబల్‌ బ్యూటీలు (ఫొటోలు)

+5

లిక్కర్‌ స్కాం.. బాబు బేతాళ కథలు.. జగన్‌ ధ్వజం (చిత్రాలు)

+5

అనసూయ ఇంట మరో శుభకార్యం.. పెద్ద కుమారుడితో సంప్రదాయ వేడుక (ఫొటోలు)

+5

HHVM మూవీ ఈవెంట్‌లో మెరిసిన హీరోయిన్ నిధి అగర్వాల్ (ఫొటోలు)

+5

Cannes 2025 : ‘సింధూరం’తో మెరిసిన ఐశ్వర్య (ఫోటోలు)

+5

ప్రసాద్ ఐమ్యాక్స్‌ : ‘రానా నాయుడు సీజన్-2’ టీజర్‌ ఈవెంట్‌ రానా సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం..భారీగా ట్రాఫిక్ జామ్ (ఫొటోలు)

+5

హనుమాన్‌‌ జయంతి .. జనసంద్రంగా కొండగట్టు అంజన్న క్షేత్రం (ఫొటోలు)

+5

విజయ్‌ సేతుపతి 'ఏస్‌' మూవీ ప్రీరిలీజ్‌ వేడుక (ఫొటోలు)