Breaking News

గ్లామర్‌కు నో.. ఆ ఇద్దరు హీరోయిన్స్‌లా చేయాలనుంది!

Published on Thu, 12/25/2025 - 20:26

సొంతం సినిమాతో గుజరాతీ బ్యూటీ నమిత కెరీర్‌ ప్రారంభమైంది. జెమిని, ఐతే ఏంటి!, నాయకుడు, బిల్లా, సింహా సినిమాలతో ప్రేక్షకులకు ఎంతగానో దగ్గరైంది. తమిళ, మలయాళ, కన్నడ భాషల్లోనూ అనేక సినిమాలు చేసింది. 2010 తర్వాత మళ్లీ తెలుగు తెరపై కనిపించనేలేదు. మిగతా భాషల్లోనూ ఐదారు సినిమాలు చేసి వదిలేసింది.

గతంలో తప్పులు
తాజాగా ఓ ఈవెంట్‌కు హాజరైన నమిత.. సినిమాల్లో రీఎంట్రీ ఇవ్వాలనుకుంటున్నట్లు తెలిపింది. గతంలో చేసిన తప్పులను మళ్లీ రిపీట్‌ చేయనని చెప్తోంది. అందుకోసమే కొన్ని కథలు నచ్చకపోతే ఎటువంటి మొహమాటం లేకుండా తిరస్కరిస్తున్నానంది. గ్లామరస్‌ పాత్రల్ని చేయాలనుకోవడం లేదని, పవర్‌ఫుల్‌ పాత్రల కోసం ఎదురుచూస్తున్నట్లు పేర్కొంది.

అలాంటి పాత్రలు చేయాలనుంది
ఉదాహరణకు రజనీకాంత్‌ పడయప్ప (తెలుగులో నరసింహ) సినిమాలో రమ్యకృష్ణ పోషించిన నీలాంబరి వంటి పాత్రలు చేయాలనుందని మనసులో మాట బయటపెట్టింది. సినిమా వచ్చి ఏళ్లకు ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ నీలాంబరి పాత్ర కోసం మాట్లాడుకుంటున్నారని.. అలా ఎప్పటికీ గుర్తుండిపోయే పాత్రలు చేయాలనుందని చెప్పింది. విద్యాబాలన్‌, రాధికా ఆప్టే.. కథకు బలం చేకూర్చే పాత్రల్లో కనిపిస్తారని.. వాళ్లలాగే ప్రాధాన్యత ఉన్న పాత్రలు చేయాలనుకుంటున్నట్లు తెలిపింది. మరి నమిత ఎలాంటి సినిమాతో రీఎంట్రీ ఇస్తుందో చూడాలి!

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)