Breaking News

కాలేజీ రోజుల్లోనూ నాన్న కొట్టేవాడు, అమ్మకు చెప్తే..: నళిని కూతురు

Published on Sat, 01/13/2024 - 17:56

నళిని.. ఇప్పుడంటే సీరియల్స్‌ చేస్తోంది కానీ ఒకప్పుడు సినిమాల్లో ఎక్కువగా కనిపించేది. విలనిజం పండించడంలో ఈమె దిట్ట. సినిమాల్లో, సీరియల్స్‌లో అవతలివారిని ముప్పతిప్పలు పెట్టే ఈమె నిజ జీవితంలోనూ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంది. 1987లో దర్శకనటుడు, రచయిత రామరంజన్‌ను పెళ్లాడింది. వీరికి అరుణ, అరుణ్‌ అని ఇద్దరు కవలలు జన్మించారు. రానురానూ సంసారంలో గొడవలు రావడంతో నళిని- రామరాజన్‌ 2000వ సంవత్సరంలో పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నారు.

విడాకులు.. గుక్కపెట్టి ఏడ్చిన నళిని
కోర్టులో విడాకులు మంజూరు చేయగానే నళిని గుక్కపెట్టి ఏడ్చేయగా రామరాజు అతడిని ఓదార్చాడు. అది చూసి అక్కడున్నవారంతా ఆశ్చర్యపోయారట. అలా విడిపోయినప్పటికీ ఒకరిపై మరొకరు ఆప్యాయత కురిపించుకున్నారు. తాజాగా తమ పేరెంట్స్‌ గురించి ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చింది వారి కూతురు అరుణ. ఆమె మాట్లాడుతూ.. 'విడాకుల తర్వాత కూడా అమ్మానాన్న ఎంతో అన్యోన్యంగా ఉన్నారు. అందుకు ఓ ఉదాహరణ చెప్తా.. 2010లో నాన్నకు యాక్సిడెంట్‌ అయింది. నా సోదరుడు ఫోన్‌ చేసి చెప్తే ప్రాంక్‌ కాల్‌ అనుకున్నాను. కానీ ఉదయానికల్లా అది బ్రేకింగ్‌ న్యూస్‌లో వచ్చింది.

ఎప్పుడూ నాన్న గురించి అడిగేది!
అది చూసి అమ్మ ఎంతో ఏడ్చింది. తనకు ఏయే అలర్జీలు ఉన్నాయి, ఏంటనేది అమ్మకే తెలుసు. అప్పట్లో అమ్మ సీరియల్స్‌తో చాలా బిజీగా ఉండేది. ప్రతిరోజు మేము ఆస్పత్రికి వెళ్లి రావడం, నాన్న కోలుకుంటున్న ఫోటోలను అమ్మకు చూపించడం.. ఇదే జరిగేది. నాన్న తింటున్నాడా? లేదా? అని అడిగి తెలుసుకునేది. వారి మధ్య అంత ఆప్యాయత ఉంది. అమ్మ కొట్టినప్పుడు నాన్న పట్టించుకునేవాడు కాదు. అలాగే నాన్న కొట్టినప్పుడు అమ్మ కూడా చూసీచూడనట్లుగానే వ్యవహరించేది.

ఇద్దరూ కొట్టేవారు
కొట్టేంతవరకు వచ్చిందంటే కచ్చితంగా ఏదో ఒక కారణం ఉండే ఉంటుందని ఇద్దరూ బలంగా నమ్మేవారు. నేను కాలేజీలో ఉన్నప్పుడు కూడా నాన్న కొట్టాడు. ఎవరో బంధువులు వచ్చినప్పుడు లేచి పలకరించలేదని దండించాడు. అమ్మానాన్న విడాకులు తీసుకున్న తర్వాత ఈ సంఘటన జరిగింది. ఈ విషయం ఇంటికి వెళ్లి మా అమ్మకు చెప్తే నువ్వేదో తప్పు చేసుంటావు. అందుకే కొట్టాడని లైట్‌ తీసుకుంది. అలా ఇద్దరూ చాలా స్ట్రిక్ట్‌గా ఉంటారు. కానీ ఒంటరి తల్లిగా తను ఎన్నో సమస్యలు ఎదుర్కొంది' అని చెప్పుకొచ్చింది అరుణ.

చదవండి: అక్కడ హను-మాన్‌ సినిమా ప్రదర్శించడం లేదట! డిస్ట్రిబ్యూటర్ల ఆందోళన..

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఎగ్జిబిషన్‌ మైదానంలో సందడిగా దత్తన్న అలయ్‌ బలయ్‌ (ఫొటోలు)

+5

ప్రభాస్ హీరోయిన్ కొత్త ఫొటోలు! (ఫొటోలు)