Breaking News

తాత వారసత్వాన్ని కొనసాగించేందుకు హీరోగా!

Published on Fri, 04/12/2024 - 12:51

దివంగత నటుడు నాగేశ్‌ను ఇండియన్‌ సినిమా ఎప్పటికీ మర్చిపోదు. ఈ తమిళ నటుడు తెలుగులో శ్రీ రామ బంటు, ఒక చల్లని రాత్రి, తూర్పు పడమర, సోగ్గాడు, పాపం పసివాడు, కొండవీటి సింహం, శ్రీరంగనీతులు, ప్రచండ భైరవి, భలే తమ్ముడు, శత్రువు, నేటి సావిత్రి.. ఇలా ఎన్నో చిత్రాల్లో కీలక పాత్రల్లో మెప్పించారు. ఆయన వారసత్వాన్ని కొనసాగించడానికి మనవడు, నటుడు ఆనంద్‌బాబు కుమారుడు బిజేశ్‌ నాగేశ్‌ రంగంలోకి దిగారు. ఈయన ఇంతకు ముందు సంతానం కథానాయకుడిగా నటించిన సర్వర్‌ సుందరం, ప్రభుదేవా హీరోగా నటించిన పొన్‌ మాణిక్యవేల్‌ చిత్రాల్లో కీలక పాత్రలు పోషించారు.

వానరన్‌ మూవీతో హీరోగా
ఇప్పుడు వానరన్‌ చిత్రం ద్వారా కథానాయకుడిగా పరిచయం అవుతున్నారు. ఆరెంజ్‌ పిక్చర్స్‌ పతాకంపై రాజేశ్‌ పద్మనాభన్‌, సుజాత రాజేశ్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి కథ, కథనం, మాటలు, దర్శకత్వం బాధ్యతలను శ్రీరామ్‌ పద్మనాభన్‌ నిర్వహిస్తున్నారు. అక్షయ హీరోయిన్‌గా నటిస్తుండగా లొల్లుసభ జీవా, దీపా శంకర్‌, ఆదేశ్‌ బాలా, నాంజిల్‌ విజయన్‌, ఎస్‌ఎల్‌ .బాలాజీ, బేబీ వర్ష, వెంకట్‌రాజ్‌, శివగురు, రామ్‌రాజ్‌, వెడికన్నన్‌ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

దర్శకుడు మాట్లాడుతూ.. తండ్రీకొడుకుల అనుబంధం ఇతి వృత్తంతో రూపొందిస్తున్న వానరన్‌లో బిజేశ్‌ నాగేశ్‌ చాలా సహజంగా నటించారన్నారు. అక్షయ.. ఒయిలాట్టం కళాకారిణిగా అద్భుతంగా చేశారన్నారు. చిత్ర షూటింగ్‌ను చైన్నె పరిసర ప్రాంతాల్లో 30 రోజుల పాటు ఏకధాటిగా నిర్వహించి పూర్తి చేసినట్లు చెప్పారు. నిర్మాణాంతర కార్యక్రమాలు చివరి దశకు చేరుకున్న తరుణంలో వానరన్‌ చిత్ర ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను విడుదల చేసినట్లు చెప్పారు. ఈ పోస్టర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోందని దర్శకుడు ఆనందం వ్యక్తం చేశారు.

చదవండి: ఛాతీలో నొప్పి.. ప్రముఖ నటుడికి ఆంజియోప్లాస్టీ

Videos

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

Photos

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)