Breaking News

అఖిల్‌పై ఆ భయం ఉండేది.. ‘లెనిన్‌’ చూసి ఆశ్చర్యపోయా : నాగార్జున

Published on Mon, 07/06/2026 - 13:35

‘‘లెనిన్‌’ రాయలసీమ కథ. సింపుల్‌గా చెప్పాలంటే సీమలో జరుగుతున్న మహాభారతం. ఈ సినిమాకు ముందు అఖిల్‌ ఎక్కువగా అర్బన్‌ ఫిల్మ్స్‌ చేశాడు. మరి... ఈ సినిమాకి సూట్‌ అవుతాడా? అని ముందు నాకు భయంగా ఉండేది. కానీ సినిమా చూశాక, నేను కాదు... అందరూ ఆశ్చర్యపోయారు. ‘లెనిన్‌’ రోల్‌లోకి అఖిల్‌ వెళ్లిపోయాడు. సినిమా చూసిన తర్వాత లెనిన్‌  స్నేహాన్ని, ప్రేమను, పగని కూడా ప్రేమిస్తారు. లెనిన్‌ ను మీరు ఇంటికి తీసుకెళ్లిపోతారు. మీకు అఖిల్‌ కనపడడు... ‘లెనిన్‌ ’ కనిపిస్తాడు’’ అని నాగార్జున అన్నారు. 

అఖిల్, భాగ్యశ్రీ భోర్సే హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘లెనిన్‌ ’. అన్నపూర్ణ స్టూడియోస్‌ సమర్పణలో మురళీ కిషోర్‌ అబ్బూరు (నందు) దర్శకత్వంలో అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 10న విడుదల కానుంది. ఆదివారం తిరుపతిలో జరిగిన ‘లెనిన్‌’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో నాగార్జున మాట్లాడుతూ– ‘‘ప్రేమ కోసం యుద్ధాలు జరిగాయి. ప్రేమకోసం రాజ్యాలు కూలిపోయాయి. ‘లెనిన్‌’లో కూడా ఒక ప్రేమకథ ఉంది. నందు ఈ సినిమా కథ చెప్పడానికి వచ్చినప్పుడు ఇది శ్రీరామపురంలో జరిగే కథ అన్నాడు. 

‘శ్రీరామపురం’ అంటే మా నాన్నగారు పుట్టిన ఊరు (కృష్ణా జిల్లా). అయితే ఈ శ్రీరామపురం చిత్తూరు జిల్లాలో అని చెప్పాడు. కానీ శ్రీరామపురం అంటే నాకో సెంటిమెంట్‌. దీంతో నందును కథ చెప్పమన్నాను. నందు కథ చెప్పడం మొదలు పెట్టాడు. ఇందులో పాత్రలు డిఫరెంట్‌గా అనిపించాయి. ‘లెనిన్‌’ సెకండాఫ్‌లోని ట్విస్ట్‌లను ప్రేక్షకులు ఊహించలేరు. మా పార్ట్‌నర్‌ నాగవంశీకి ఈ సినిమాపై ఎంత కాన్ఫిడెన్స్‌ అంటే... ఏపీ అంతా అతనే డిస్ట్రిబ్యూట్‌ చేస్తున్నాడు. మన అందరికీ దేవుడు ఆ వెంకటేశ్వరస్వామి. నాన్నగారు ఎప్పుడూ అంటుంటారు ఆయనకు దేవుడు మాత్రం ప్రేక్షక దేవుళ్ళు అని. సో... ఈ ప్రేక్షక దేవుళ్లుకు చెబుతున్నాను. జూలై 10న వస్తున్నాం. మనవాడు కొడుతున్నాడు’’ అని అన్నారు. 

అఖిల్‌ మాట్లాడుతూ– ‘‘లెనిన్‌’ఉద్దేశం ఒకటే. నేను మీ ఇంటివాడినైపోవాలి. మీ సీమ బిడ్డ మురళీకిషోర్‌ రెండేళ్ల క్రితం ఈ సినిమా కథ చెప్పారు. నేను చేయాలనుకున్న కథ ఇదే అనిపించింది’’ అన్నారు. ‘‘ఈ మూవీలో భారతి అనే పాత్ర చేశాను. ఈ సినిమా నా కెరీర్‌లో చాలా స్పెషల్‌’’ అన్నారు భాగ్యశ్రీ బోర్సే. 

‘‘నాగేశ్వరరావుగారి మనవడు, నాగార్జునగారి అబ్బాయి అఖిల్‌ గోల్డెన్‌  స్పూన్‌ తో పుట్టాడు. పెద్ద కష్టపడలేడని అంటుంటారు. కానీ సోల్‌ ఆఫ్‌ లెనిన్‌  వచ్చినప్పట్నుంచి ‘అఖిల్‌ ఫస్ట్‌ టైమ్‌ కష్టపడుతున్నట్లు కనిపిస్తుంది కదరా’ అనేవాళ్లు. ఈ అభిప్రాయాన్ని జనాల్లోకి తీసుకుని వెళ్లేందుకు అఖిల్‌గారు ఎంత కష్టపడ్డారో మేం చూశాం. ఇది రెగ్యులర్‌ మాస్‌ మూవీ కాదు. రెండు మూడు చోట్ల ఆడియన్స్‌ సర్‌ప్రైజ్‌ అవుతారు. అలాంటి స్క్రీన్‌ప్లే రాశాడు నందు’’ అన్నారు నాగవంశీ. బ్రహ్మాజీ, సునీల్‌ మాట్లాడారు.   

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)