Breaking News

'నా సామి రంగ' ఓటీటీ పార్ట్‌నర్ ఫిక్స్.. ఆ సంస్థతో భారీ డీల్!

Published on Sun, 01/14/2024 - 15:18

ఈసారి సంక్రాంతి బరిలో నిలిచిన చివరి సినిమా 'నా సామి రంగ' కూడా థియేటర్లలోకి వచ్చేసింది. పూర్తి విలేజ్ బ్యాక్‌డ్రాప్ స్టోరీతో తీసిన ఈ మూవీలో నాగార్జునతో పాటు అల్లరి నరేశ్, రాజ్ తరుణ్ నటించారు. కొరియోగ్రాఫర్ విజయ్ బిన్నీ ఈ చిత్రంతో డైరెక్టర్ అయ్యాడు. ఇంతకీ ఈ మూవీ ఎలా ఉంది? ఓటీటీ పార్ట్‌నర్ ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం.

కింగ్ నాగార్జున.. మొన్నటివరకు బిగ్‌బాస్ 7వ సీజన్ హోస్ట్‌గా చేశారు. దీనితోపాటే 'నా సామి రంగ' షూటింగ్ కూడా పూర్తి చేశారు. సెప్టెంబరులో మొదలైన ఈ చిత్రం కేవలం నాలుగు నెలల్లోనే అన్నీ పూర్తి చేసుకుని  సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకొచ్చేసింది. మరీ సూపర్ కాకపోయినా పర్వాలేదు అనే టాక్ తెచ్చుకుంది.

(ఇదీ చదవండి: రెండో రోజుకే భారీగా తగ్గిపోయిన 'గుంటూరు కారం' కలెక్షన్స్)

ఇకపోతే బిగ్‌బాస్ హోస్ట్‌గా చేస్తున్న నాగార్జున.. తనకు సదరు ఛానెల్‌తో ఉన్న బాండింగ్ నేపథ్యంలో 'నా సామి రంగ' చిత్రానికి మంచి డీల్ కుదిర్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే డిజిటల్ హక్కుల్ని డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ సంస్థ దక్కించుకుంది. అలానే 45 రోజుల తర్వాత ఓటీటీలో రిలీజ్ చేసేలా డీల్ మాట్లాడుకున్నారట.

అయితే సినిమాని ఓటీటీ సంస్థకు అమ్మిన తర్వాత ఎప్పుడు స్ట్రీమింగ్ చేయాలనేది సంస్థ తీసుకునే నిర్ణయం బట్టి ఆధారపడి ఉంటుంది. అంటే 'నా సామి రంగ' చిత్రాన్ని 30 రోజుల తర్వాత ఓటీటీ రిలీజ్ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. దీనిబట్టి చూస్తే ఫిబ్రవరి 3వ వారం లేదంటే మార్చి తొలి వారంలో ఈ సినిమా ఓటీటీలోకి రావొచ్చని అనిపిస్తుంది.

(ఇదీ చదవండి: Naa Saami Ranga Review: ‘నా సామిరంగ’ మూవీ రివ్యూ)

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)