Breaking News

నాగార్జున ఐకానిక్ మూవీ.. గూస్‌బంప్స్‌ తెప్పిస్తోన్న రీ రిలీజ్ ట్రైలర్‌

Published on Tue, 11/04/2025 - 18:11

అక్కినేని నాగార్జున నటించిన ఐకానిక్ కమర్షియల్ మూవీ 'శివ' రీరిలీజ్‌ కోసం అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాతో రామ్‌గోపాల్‌ వర్మ దర్శకునిగా పరిచయమయ్యారు. అక్కినేని వెంకట్, యార్లగడ్డ సురేంద్ర నిర్మించిన ఈ సినిమా 1989 అక్టోబర్‌ 5న రిలీజై బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఇళయరాజా సంగీతంలో ఈ సినిమా మ్యూజికల్‌ హిట్‌గానూ నిలిచింది. ఈ సినిమాని ‘శివ’ (1990) పేరుతోనే హిందీలో రీమేక్‌ చేసిన రామ్‌గోపాల్‌ వర్మ అక్కడ కూడా హిట్‌ అందుకున్నారు. ఇప్పుడు తెలుగులో  మరోసారి వెండితెరపైకి రానుంది. అన్నపూర్ణ స్టూడియోస్ స్థాపించి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కల్ట్ మూవీ శివను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. 

ఈ మూవీని మరోసారి బిగ్‌ స్క్రీన్‌పై ప్రదర్శించనున్నారు. ఈ నేపథ్యంలోనే శివ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. సరికొత్త 4కె వర్షన్‌లో శివ ట్రైలర్‌ విడుదల చేశారు. ఈ సందర్భంగా టాలీవుడ్ స్టార్ డైరెక్టర్స్‌, హీరోలు శివ మూవీపై ప్రశంసలు కురిపించారు. తెలుగు సినిమా గతిని మార్చేసిన సినిమా శివ అంటూ పలవురు స్టార్స్ కామెంట్స్ చేశారు. ఇంకెందుకు ఆలస్యం శివ 4కె ట్రైలర్‌ మీరు కూడా చూసేయండి.

కాగా.. ఈ  సినిమాను నవంబర్ 14న థియేటర్లలో రీ రిలీజ్ చేస్తున్నారు. నాగార్జున హీరోగా నటించిన ఈ చిత్రంలో అమల హీరోయిన్‌గా నటించారు.  కాలేజీలో విద్యార్థుల మధ్య గొడవలు, గ్యాంగ్‌లు, రాజకీయ నాయకులు తమ అవసరాల కోసం స్టూడెంట్స్‌ని ఎలా ఉపయోగించుకుంటారు? విద్యార్థుల మధ్య ఎలాంటి గొడవలు సృష్టిస్తారు? ఇలాంటి సామాజిక అంశాల నేపథ్యంలో ఈ సినిమాని తెరకెక్కించి సరికొత్త ట్రెండ్‌ని సృష్టించారు రాం గోపాల్ వర్మ.
 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)