Breaking News

ఆ సినిమా కోసం నెలపాటు మణిరత్నం వెంటపడ్డా: నాగార్జున

Published on Sun, 08/17/2025 - 21:26

'కూలీ' సినిమాతో ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చిన నాగార్జున.. తొలిసారి విలన్‌గా చేసి ఆకట్టుకున్నాడు. రెండు నెలల క్రితం 'కుబేర'లో వైవిధ్యమైన సహాయ పాత్రలో కనిపించి మెప్పించాడు. అయితే ఇప్పుడంటే నాగ్ వెంటపడి దర్శకులు సినిమాలు తీస్తున్నారు. కానీ స్వయంగా నాగార్జున.. డైరెక్టర్ మణిరత్నం వెంటపడి ఓ సినిమా చేశారని మీలో ఎందరికీ తెలుసు. అవును ఆ సంగతులు నాగ్ ఇప్పుడు బయటపెట్టాడు.

జగపతిబాబు హోస్ట్‌గా ఓ టాక్ షో ప్రారంభమైంది. అందులో నాగార్జున తొలి గెస్ట్‌గా వచ్చాడు. ఈ క్రమంలోనే ఎన్నో సంగతులు పంచుకున్న నాగ్.. తన యాక్టింగ్ కెరీర్ గురించి ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. మణిరత్నం వెంటపడి 'గీతాంజలి' సినిమా చేసిన అనుభవం గురించి బయటపెట్టారు.

(ఇదీ చదవండి: చిరుతో సినిమా.. క్లర్క్ నన్ను చూసి జాలిపడ్డాడు: టాలీవుడ్ నిర్మాత)

'నేను చేసిన ప్రారంభ సినిమాలని నాగేశ్వరరావు అబ్బాయి అనే ఉ‍ద్దేశంతోనే ప్రేక్షకులు చూశారు. కొందరికి నా యాక్టింగ్ నచ్చితే మరికొందరికి నచ్చలేదు. తర్వాత కూడా ఆరేడు మూవీస్ చేశా. అలా 'మజ్ను' నాకు బ్రేక్ ఇచ్చింది. కమర్షియల్ చిత్రాల్లో అయితే 'ఆఖరి పోరాటం' హిట్ అయింది. అయితే అందులో నేను బొమ్మలా ఉన్నానంతే. డైరెక్టర్ రాఘవేంద్రరావు, హీరోయిన్ శ్రీదేవి వల్ల మూవీ సక్సెస్ అయింది'

'మణిరత్నం తీసిన 'మౌనరాగం' సినిమా నాకు బాగా నచ్చింది. దీంతో ఆయనతో ఎలాగైనా సినిమా చేయాలని అనుకున్నాను. ఆయన వాకింగ్‌కి వెళ్లే పార్క్ వివరాలు తెలుసుకుని, దాదాపు నెలరోజులు ఆయన వెంటపడ్డాను. పది నిమిషాలు కలిసి నడిచిన తర్వాత ఆయన టెన్నిస్ ఆడేందుకు వెళ్లిపోయారు. చివరకు ఎలాగోలా ఒప్పించాను. అలా 'గీతాంజలి' మూవీ వచ్చింది. దాన్ని తమిళంలోనే తీయాలనుకున్నారు. కానీ తెలుగు మార్కెట్ కూడా పెంచుకోండి అని సలహా ఇవ్వడంతో నాతో సినిమాకి ఒప్పుకొన్నారు. అనుకున్నట్లే హిట్ అయింది' అని నాగార్జున చెప్పుకొచ్చారు.

(ఇదీ చదవండి: 22 ఏళ్ల కొడుకు.. అయినా సరే రెండో పెళ్లికి నటి రెడీ)

Videos

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

మళ్లీ ఢిల్లీకి రేవంత్.. మంత్రుల్లో కొత్త టెన్షన్!

10 ఏళ్లలో 82% పనులు..!వెలిగొండపై YSR-జగన్ కు ఘనత

Pedakakani Temple: గుడిలోకి వెళ్లకుండా ఆపారు ఇచ్చిపడేసిన అశోక్ బాబు

బాలిక ఎక్కడుంది..? 80 రోజులైనా ఆచూకీ లేదు పోలీసుల తీరుపై హైకోర్టు ఫైర్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు