Breaking News

మార్ఫింగ్‌ వీడియోలు.. ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన నాగార్జున

Published on Thu, 09/25/2025 - 11:55

సాక్షి, డిల్లీ: తన పేరుతో మార్ఫింగ్‌ వీడియోలు చేయడం ఆపాలంటూ హీరో అక్కినేని నాగార్జున (Nagarjuna Akkineni) ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు.  ఏఐ సాయంతో యూట్యూబ్‌ షార్ట్స్‌, వీడియోలు క్రియేట్‌ చేయడం, వాటికి నాగార్జున హ్యాష్‌ ట్యాగ్స్‌ ఇవ్వడం ఆపేయాలని పిటిషన్‌ వేశారు. తన అనుమతి లేకుండా ఫోటోలు, వీడియోలు, పేరు ఉపయోగించి వెబ్ సైట్స్ బిజినెస్ చేయడాన్ని ఆపాలని  పిటిషన్‌లో కోరారు. ఐశ్వర్య రాయ్ ఫోటోలు ఉపయోగించి సొమ్ము చేసుకున్న తరహాలోనే తన ఫోటోలు, పేరు వాడుకుంటున్నారని పేర్కొన్నారు.

పేరు దుర్వినియోగం
ఏఐ సాయంతో పోర్నోగ్రఫీ కంటెంట్‌, లింక్స్‌ క్రియేట్‌ చేశారని నాగార్జున తరపు న్యాయవాది కోర్టుకు వెల్లడించారు. టీ షర్టులపై ఆయన ఫోటో ముద్రించి బిజినెస్‌ చేస్తున్నట్లు వెల్లడించారు. హీరో పేరును, ఫోటోలను దుర్వినియోగం చేస్తున్నారని, నాగార్జున వ్యక్తిగత హక్కులను కాపాడాలని పిటిషన్‌లో కోరారు. నాగార్జున ఏఐ వీడియోలు అప్‌లోడ్‌ చేసిన 14 వెబ్ సైట్స్ ఆ లింక్స్‌ను తొలగించాలని డిమాండ్‌ చేశారు. దీనిపై జస్టిస్‌ తేజస్‌ కరియా ధర్మాసం గురువారం విచారించింది. నాగార్జున పర్సనాలిటీ రైట్స్‌ కాపాడుతామని తెలిపింది.

AI వీడియోలు, పెయిడ్ ప్రమోషన్స్ ఆపాలని నాగార్జున పిటిషన్

గతంలో..
గతంలో బాలీవుడ్ హీరోహీరోయిన్లు అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్‌, అనిల్ కపూర్ తదితరులు తమ వ్యక్తిగత హక్కులను కాపాడాలంటూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. సినీనటుల అనుమతి లేకుండా వారి పేరును వాడుకోవద్దంటూ ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వులు కూడా ఇచ్చింది. ఈ క్రమంలోనే నాగార్జున సైతం కోర్టును ఆశ్రయించారు.

చదవండి: పగోడికి కూడా ఇలాంటి కష్టం రాకూడదు: సల్మాన్‌ ఖాన్‌

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)