Breaking News

అవాస్తవాలు నమ్మొద్దు.. ఒక్క సెంట్‌ కూడా ఆక్రమించలేదు: నాగార్జున ట్వీట్

Published on Sun, 08/25/2024 - 19:03

సాక్షి, హైదరాబాద్‌: అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్‌ కన్వెన్షన్‌ను హైడ్రా అధికారులు కూల్చివేయడంపై మరో ట్వీట్ చేశారు. ఇప్పటికే హైకోర్ట్ నుంచి స్టే తెచ్చుకున్న ఆయన ఎన్-కన్వెన్షన్ కి  సంబంధించి  వస్తున్న వార్తల్లో వాస్తవానికి దూరంగా ఉన్నాయని తెలిపారు. ఊహగానాలు ఎక్కువగా వినిపిస్తున్నాయని.. అది పూర్తిగా పట్టా భూమి అని నాగ్ క్లారిటీ ఇచ్చారు. ఒక్క సెంట్‌ కూడా ఆక్రమించలేదని స్పష్టం చేశారు. తుమ్మిడికుంట చెరువు ఆక్రమణకు గురి కాలేదని స్పెషల్ కోర్టు తీర్పు ఇచ్చిందని నాగార్జున వెల్లడించారు. 

కాగా.. తమ్మిడికుంట చెరువులో మూడున్నర ఎకరాలు కబ్జా చేసి ఎన్‌ కన్వెన్షన్‌ కట్టారని ఆరోపణలు రావడంతో హైడ్రా నేలమట్టం చేసింది. అయితే కూల్చివేతకు ముందు కూడా తమకు ఎలాంటి నోటీసు జారీ చేయలేదని నాగార్జున తెలిపారు. కోర్టులో కేసు నడుస్తున్నప్పుడు ఇలా చేయడం సరికాదన్నారు. చట్టాన్ని గౌరవించే పౌరుడిగా, కోర్టు నాకు వ్యతిరేకంగా తీర్పునిస్తే కచ్చితంగా తానే దగ్గరుండి నేలమట్టం చేసేవాడినని అన్నారు. ఇలాంటి పరిణామాల వల్ల, మేమేదో కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు చేపట్టామని ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళ్ళే అవకాశముందన్నారు. స్టే ఆర్డర్ ఉన్నప్పటికీ ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చివేయడంతో నాగార్జున కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)