Breaking News

నాగార్జున వందో సినిమా.. ఆ డైరెక్టర్‌తోనే ఫిక్స్!

Published on Tue, 08/19/2025 - 21:08

టాలీవుడ్ కింగ్ నాగార్జున ఇటీవలే కూలీ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. రజినీకాంత్ హీరోగా వచ్చిన ఈ చిత్రంలో విలన్‌ పాత్రలో మెప్పించారు. అంతకుముందే కుబేర మూవీతో హిట్‌ కొట్టిన నాగ్.. కూలీ మరో సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నారు. ప్రస్తుతం ఈ సినిమా థియేటర్లలో సందడి చేస్తోంది.

ఈ మూవీ తర్వాత నాగార్జున చేయబోయే ప్రాజెక్ట్‌పై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఎందుకంటే ఈ సినిమా ఆయన కెరీర్‌లో ప్రత్యేకంగా నిలవనుంది. తన రాబోయే చిత్రం నాగార్జున వందో చిత్రంగా కానుంది. ఈ ప్రత్యేక మూవీకి సంబంధించిన కింగ్ నాగ్ హింట్ ఇచ్చేశాడు. తాజాగా జగపతిబాబు టాక్‌ షోకు హాజరైన డైరెక్టర్‌ పేరును కూడా రివీల్ చేశాడు. ఇంతకీ ఆ వివరాలేంటో చూసేద్దాం.

తన వందో సినిమాపై దాదాపు ఆరేడు నెలలుగా వర్క్ జరుగుతోందని టాక్ షోలో నాగార్జున తెలిపారు. ఏడాది క్రితమే డైరెక్టర్ రా కార్తీక్ తనకు కథ చెప్పారని అన్నారు. ఇది కూడా చాలా గ్రాండ్‌గా ఉంటుంది.. కూలీ రిలీజ్ కాగానే మొదలు పెడదామని చెప్పానని తెలిపారు. యాక్షన్‌తో పాటు ఫ్యామిలీ డ్రామాగా ఉండనుందని కింగ్ నాగార్జున పంచుకున్నారు. ఈ సినిమాలో నేనే లీడ్‌ రోల్‌ చేస్తున్నానని వెల్లడించారు. దీంతో అక్కినేని ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాకు కింగ్‌ 100 నాటౌట్‌ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారని సమాచారం. కాగా.. తమిళ దర్శకుడు రా కార్తీక్ ఇప్పటికే ఆకాశం, నితమ్ ఓరువానం లాంటి చిత్రాలను తెరకెక్కించారు.

Videos

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)