Breaking News

చైసామ్‌ విడాకులపై మంత్రి అనుచిత వ్యాఖ్యలు.. కేసు వాయిదా

Published on Fri, 07/25/2025 - 13:13

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర అటవీ, దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖపై హీరో నాగార్జున (Nagarjuna Akkineni) దాఖలు చేసిన పరువునష్టం కేసుపై గురువారం నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల కోర్టు (స్పెషల్‌ జ్యుడీషియల్‌ ఫస్ట్‌క్లాస్‌ మెజిస్ట్రేట్‌)లో విచారణ జరిగింది. అగ్రనటుడు నాగార్జున కుమారుడైన హీరో నాగ చైతన్య–సమంత విడాకుల విషయమై మంత్రి కొండా సురేఖ అసంబద్ధమైన వ్యాఖ్యలు చేశారని, ఆమె వ్యాఖ్యలతో తన కుటుంబ పరువుపోయిందని నాగార్జున నాంపల్లి కోర్టులో పరువు నష్టం కేసు దాఖలు చేసిన విషయం తెలిసిందే. 

గైర్హాజరు
ఈ కేసు విచారణకు ప్రతివాది అయిన మంత్రి కొండా సురేఖ ఎగ్జామినేషన్‌కు హాజరు కావాల్సి ఉండగా గైర్హాజరయ్యారు. పిటిషనర్‌ నాగార్జున కూడా గైర్హాజరు కావడంతో వారి తరుపున న్యాయవాదులు పిటిషన్లు దాఖలు చేశారు. మంత్రి కొండా సురేఖ ఢిల్లీ వెళ్లారని వచ్చే విచారణకు హాజరు అవుతారని ఆమె తరఫు న్యాయవాది గుర్మిత్‌సింగ్‌ కోర్టుకు సూచించారు. దీంతో విచారణను ఈనెల 28కు వాయిదా వేసిన కోర్టు తప్పకుండా ఆ విచారణకు హాజరు కావాలని సూచించింది.

ఏం జరిగింది?
నాగచైతన్య–సమంత విడాకులపై మంత్రి కొండా సురేఖ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వీరు విడిపోవడానికి కేటీఆర్‌ కారణమన్నారు. నాగార్జున, చైతన్య కలిసి.. సమంతపై ఒత్తిడి తీసుకొచ్చారని, అది నచ్చకే ఆమె విడాకులు తీసుకుందని ఆరోపణలు చేయడం పెను సంచలనమైంది. ఆమె మాట్లాడిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. ఆమె వ్యాఖ్యల్ని సినీ ప్రముఖులు ఖండించారు. దీంతో ఆమె క్షమాపణలు చెప్పడంతోపాటు తన వ్యాఖ్యలను వెనక్కు తీసుకున్నారు. అయితే తనకుగానీ, తన కుటుంబానికి కానీ క్షమాపణ చెప్పలేదంటూ.. నాగార్జున కొండా సురేఖపై పరువునష్టం దావా వేశారు.

చదవండి: మళ్లీ ఇన్నేళ్లకు ఎన్టీఆర్ సిక్స్ ప్యాక్

Videos

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)