Breaking News

కారణం లేకుండా విజయ్‌ని టార్గెట్ చేస్తున్నారు: నాగవంశీ

Published on Tue, 07/15/2025 - 11:35

తన మాటలు, చేతలతో కాంట్రవర్సీలకు కేరాఫ్ అయిన విజయ్ దేవరకొండ ప్రస్తుతం చాలా సైలెంట్ అయిపోయాడు. మరో 15 రోజుల్లో ఇతడు నటించిన 'కింగ్డమ్' సినిమా థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా నెమ్మదిగా ప్రమోషన్లు మొదలుపెట్టారు. నిర్మాత నాగవంశీ లేటెస్ట్‌గా ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు. చిత్ర విశేషాలతో పాటు విజయ్ దేవరకొండని నెటిజన్లు టార్గెట్ చేయడం గురించి కూడా మాట్లాడారు. కారణం లేకుండానే అలా చేస్తున్నారని తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చారు.

'విజయ్ దేవరకొండని అందరూ తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. అలానే కారణం లేకుండా అతడిని ఎందుకు టార్గెట్ చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. 'రెట్రో' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‍‌లో కావొచ్చు, రీసెంట్‌గా బాలీవుడ్ ఇంటర్వ్యూలో కావొచ్చు.. అతడు మాట్లాడింది వేరే అర్థం వచ్చేలా మార్చేస్తున్నారు' అని నాగవంశీ చెప్పుకొచ్చాడు.

(ఇదీ చదవండి: పవన్‌ ఫ్యాన్స్‌ని భయపెడుతున్న మెహర్ రమేష్)

విజయ్ దేవరకొండ విషయానికొస్తే కెరీర్ ప్రారంభంలో పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి, గీతగోవిందం తదితర సినిమాలతో సక్సెస్ అందుకున్నాడు. దీంతో తర్వాత సినిమాల ప్రీ రిలీజ్ ఫంక్షన్లలో ఆటిట్యూడ్‌తో మాట్లాడేవాడు. ఈ విషయమై సోషల్ మీడియాలో గట్టిగానే ట్రోల్స్ వచ్చేవి. అందుకు తగ్గట్లు గత కొన్నేళ్లుగా ఇతడు చేసిన సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయాయి. మరీ ముఖ్యంగా గత రెండు చిత్రాలు లైగర్, ఫ్యామిలీ స్టార్ అయితే ఘోరమైన రిజల్ట్ అందుకున్నాయి. అందుకే ఇప్పుడు విజయ్ పూర్తిగా సైలెంట్ అయిపోయాడు. హిట్ కొట్టిన తర్వాత మాట్లాడుదాం అనుకుంటున్నారు.

'కింగ్డమ్'.. జూలై 31న థియేటర్లలోకి రానుంది. మరోవైపు రాహుల్ సంక్రిత్యాన్ తో‌ఓ సినిమా, దిల్ రాజు నిర్మాణంలో 'రౌడీ జనార్ధన్' అని మరో మూవీ విజయ్ దేవరకొండ చేస్తున్నాడు. ఈ మూడు కూడా సక్సెస్ అయితేనే విజయ్ కెరీర్ పరంగా నిలబడతాడు. లేదంటే మాత్రం రేసులో వెనకబడిపోతాడు.

(ఇదీ చదవండి: ప్రభాస్‌ ఇంత మారిపోయాడా? అస్సలు ఊహించలేదుగా)

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)