Breaking News

శోభిత, సమంతతో నాగచైతన్య.. ఫోటో వైరల్‌

Published on Mon, 12/22/2025 - 10:03

అక్కినేని నాగచైతన్య- శోభిత ధూళిపాళ జంట ఇటీవలే మొదటి పెళ్లిరోజును సింపుల్‌గా జరుపుకున్నారు. ఫస్ట్‌ యానివర్సరీ రోజు తమ పెళ్లిరోజు వీడియోను అభిమానులతో పంచుకున్నారు. వీరిద్దరూ కలిసున్న ఫోటోలను తరచూ కాకుండా అప్పుడప్పుడు సోషల్‌ మీడియాలో వదులుతూ ఫ్యాన్స్‌ను సర్‌ప్రైజ్‌ చేస్తుంటారు. అయితే ఈసారి చై-శోభితతో పాటు సమంత కూడా కలిసున్న ఫోటో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

ఫ్యామిలీ ఫోటో
అవును, చై, శోభిత, సమంత.. ముగ్గురూ కలిసి సెల్ఫీకి పోజిచ్చారు. కాకపోతే ఇక్కడ సమంత అంటే హీరోయిన్‌ సామ్‌ కాదులెండి. శోభిత సోదరి! ఆమె పేరు కూడా సమంతనే కావడంతో ఈ ఫోటో నెట్టింట తెగ వైరలవుతోంది. చై మాజీ భార్య పేరు, మరదలి పేరు ఒకటే కావడంతో ఈ ఫోటో చర్చనీయాంశంగా మారింది.

చై వైవాహిక జీవితం
హీరో నాగచైతన్య, హీరోయిన్‌ సమంత.. ఏ మాయ చేసావే మూవీలో తొలిసారి జంటగా నటించారు. అప్పుడే ప్రేమలో పడ్డారు. ఆ ప్రేమను పెద్దలు కూడా ఒప్పుకోవడంతో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్నారు. క్యూట్‌ కపుల్‌గా కనిపించే ఈ జంట మధ్య తర్వాత తెలియని అగాధం ఏర్పడింది. దీంతో నాలుగేళ్ల వైవాహిక బంధానికి ఫుల్‌స్టాప్‌ పెడుతూ 2021లో విడాకులు తీసుకున్నారు.

రెండో పెళ్లి
తర్వాత చై.. హీరోయిన్‌ శోభిత ధూళిపాళను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. 2024 డిసెంబర్‌ 4న వీరి వివాహం జరిగింది. అటు సమంత కూడా కొంతకాలంగా ఫ్యామిలీ మ్యాన్‌ దర్శకుడు రాజ్‌ నిడిమోరుతో ప్రేమాయణం నడిపింది. 2025 డిసెంబర్‌ 1న ఆ ప్రేమను పెళ్లి బంధంగా మార్చింది. కోయంబత్తూరులోని ఈశా యోగా సెంటర్‌లో సామ్‌-రాజ్‌ రెండో పెళ్లి చేసుకున్నారు.

 

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)