విడాకుల తర్వాత తొలిసారి సమంతతో ఉన్న ఫోటో షేర్‌ చేసిన చై

Published on Sun, 02/26/2023 - 15:00

సమంత-నాగచైతన్య తొలిసారి నటించిన సినిమా ఏమాయ చేశావే. గౌతమ్‌మీనన్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాతోనే సమంత ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. తొలి సినిమాతోనే జెస్సీగా అలరించి కుర్రాళ్ల మనసు దోచుకుంది. అంతేకాదు ఇండస్ట్రీలోనూ బ్యాక్‌ టూ బ్యాక్‌ హిట్స్‌తో టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌గానూ క్రేజ్‌ సంపాదించుకుంది. నాగ చైతన్య అంతకుముందే జోష్‌ అనే సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైనా ఏమాయ చేశావే సినిమాతోనే తొలి హిట్‌ అందుకున్నాడు.

తెరపైనే కాదు ఆఫ్‌ స్క్రీన్‌లోనూ చై-సామ్‌ల జోడికి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఈ సినిమా సెట్స్‌లోనే వీరిద్దరి మధ్య స్నేహం చిగురించింది. అలా మొదలైన వారి పరిచయం ప్రేమగా మారి 2017లో పెళ్లి చేసుకున్నారు. కానీ వ్యక్తిగత కారణాలతో 2021, అక్టోబర్‌ 2న విడిపోతున్నట్లు ప్రకటించి అందరికి షాక్‌ ఇచ్చారు. టాలీవుడ్‌ క్యూట్‌ కపుల్‌గా పేరు తెచ్చుకున్న వీరు ఎందుకు విడాకులు తీసుకున్నారన్నది ఇప్పటికీ సమాధానం లేని ప్రశ్నగానే మిగిలిపోయింది.

నాగచైతన్యతో విడాకుల తర్వాత అతనితో దిగిన ఫోటోలన్నింటిని సామ్‌ తన సోషల్‌ మీడియా అకౌంట్స్‌ నుంచి డిలీట్‌ చేసిన సంగతి తెలిసిందే. అటు చై కూడా విడాకుల తర్వాత సామ్‌కు సంబంధించి ఎలాంటి పోస్టులు చేయలేదు.

అయితే తాజాగా ఏమాయ చేశావే సినిమా వచ్చి నేటితో 13ఏళ్లు పూర్తయిన సందర్భంగా.. ఆ మూవీలో సమంతతో దిగిన ఓ ఫోటోను నాగచైతన్య  తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేస్తూ.. సెలబ్రేటింగ్‌ 13ఇయర్స్‌ అంటూ పోస్ట్‌ చేశాడు. సమంత కూడా ఏమాయ చేశావేకు పదమూడేళ్లు అంటూ పలు ఫోటోలను షేర్‌ చేసినా అందులో కేవలం తన ఫోటోలు మాత్రమే నెట్టింట పోస్ట్‌ చేసింది. దీంతో ఇద్దరి ఇన్‌స్టా పోస్టులు ఇప్పుడు మరోసారి హాట్‌టాపిక్‌గా మారాయి. 

Videos

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

Photos

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)