Breaking News

అన్నపూర్ణ స్టూడియోస్‌లో నాగచైతన్య- శోభిత వెడ్డింగ్.. అసలు కారణం వెల్లడించిన చైతూ!

Published on Sun, 11/24/2024 - 15:31

మరి కొద్ది రోజుల్లోనే అక్కినేని వారి ఇంట పెళ్లి సందడి జరగనుంది. డిసెంబర్ 4న నాగ చైతన్య, శోభితా ధూళిపాళ్ల కొత్త జీవితం ప్రారంభించనున్నారు. హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్డూడియోస్ వేదికగా గ్రాండ్ వెడ్డింగ్ జరగనుంది. ఇప్పటికే రెండు కుటుంబాలు పెళ్లి పనులతో బిజీగా ఉన్నారు.

పెళ్లి వేదిక అక్కడే ఎందుకంటే..

అయితే అన్నపూర్ణ స్టూడియోస్‌నే పెళ్లి వేదికగా ఫిక్స్ చేశారు. అయితే ఎలాంటి ఆడంబరం లేకుండా సింపుల్‌గానే చేయాలని నాగచైతన్య కోరినట్లు నాగార్జున వెల్లడించారు. అందుకే పెళ్లి పనులు వారిద్దరే చూసుకుంటున్నట్లు తెలిపారు.  అన్నపూర్ణ స్టూడియోస్‌లో నాగచైతన్య-శోభిత పెళ్లి జరగడానికి అదే సెంటిమెంట్‌గా తెలుస్తోంది. అక్కడే తాతయ్య అక్కినేని నాగేశ్వరరావు విగ్రహం ఉండడమే కారణం.

కుటుంబ ఉమ్మడి నిర్ణయం..

ఈ పెళ్లికి ఆయన ఆశీర్వాదాలు కూడా ఉండాలని ఫ్యామిలీ తీసుకున్న నిర్ణయమని చైతూ తెలిపారు. అందుకే తన తాత అక్కినేని నాగేశ్వరరావు విగ్రహం ముందు వివాహం చేసుకోబోతున్నట్లు తాజాగా ఓ ఇంటర్వ్యూలో చైతూ వెల్లడించారు. మా కుటుంబాలు ఒకచోట చేరి ఈ వేడుక జరుపుకునేందుకు ఉత్సాహంగా ఉన్నారని వివరించారు. శోభితతో కలిసి కొత్త జీవితం ప్రారంభించేందుకు ఎదురు చూస్తున్నట్లు చైతన్య పేర్కొన్నారు.

తనతో బాగా కనెక్ట్ అయ్యా..

శోభితతో కొత్త జీవితాన్ని ప్రారంభించేందుకు ఆశగా ఎదురుచూస్తున్నట్లు చైతూ వెల్లడించారు. ఆమెతో తాను చాలా కనెక్ట్‌ అయ్యా.. నన్ను బాగా అర్థం చేసుకుంటుందన్నారు. నా జీవితంలో ఏర్పడిన శూన్యాన్ని తాను భర్తీ చేస్తుందని తాజా ఇంటర్వ్యూలో నాగచైతన్య తెలిపారు. కాగా.. వీరిద్దరి పెళ్లి వేడుక డిసెంబర్ 4న హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో జరగనుంది.
 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)