Breaking News

బుజ్జితల్లి క్రేజ్‌.. తండేల్ సాంగ్ అరుదైన ఘనత..!

Published on Mon, 12/30/2024 - 16:39

నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటిస్తోన్న చిత్రం 'తండేల్'. ఈ సినిమాకు చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్నారు. మత్స్యకార బ్యాక్‌డ్రాప్‌లో ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు.  కార్తికేయ2 తర్వాత చందూ మొండేటి తెరకెక్కిస్తున్న చిత్రం కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి.   ఈ చిత్రాన్ని అల్లు అరవింద్‌ సమర్పణలో గీతా ఆర్ట్స్‌ పతాకంపై ‘బన్నీ’ వాసు నిర్మిస్తున్నారు. పాన్‌ ఇండియా రేంజ్‌లో వస్తోన్న ఈ మూవీ షూటింగ్‌ చివరిదశలో ఉన్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే ఈ మూవీ నుంచి బుజ్జితల్లి అనే లిరికల్ సాంగ్‌ విడుదల చేశారు. తాజాగా ఈ పాట అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. యూట్యూబ్‌లో ఏకంగా 40 మిలియన్ల వ్యూస్‌ సాధించింది. ఈ విషయాన్ని చిత్రబృందం సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. దీంతో చైతూ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

తండేల్ రిలీజ్ ఎప్పుడంటే?

ఈ సినిమా విడుదల డేట్‌పై అధికారికంగా ప్రకటన వచ్చేసింది. క్రిస్మస్, సంక్రాంతికి ఈ సినిమా విడుదల కానుందని అందరూ అనుకున్నారు. అయితే పలు కారణాల వల్ల మరో తేదీకి తండేల్‌ వస్తున్నట్లు మేకర్స్‌ ప్రకటించారు. పాన్‌ ఇండియా రేంజ్‌లో తెలుగుతో పాటు హిందీ, కన్నడ, తమిళం, మలయాళంలో ఫిబ్రవరి 7న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు.

కానీ మొదట డిసెంబర్‌ 28న 'తండేల్'  విడుదల చేయాలనుకుంటే కుదరలేదు. అయితే, సంక్రాంతి కానుకగా విడుదల చేద్దామని ప్లాన్‌ చేస్తే ఆ సమయంలో చాలా సినిమాలు పోటీలో ఉండటంతో విరమించుకున్నట్లు నిర్మాత అరవింద్‌ పేర్కొన్నారు. అలా ఫైనల్‌గా ఫిబ్రవరి 7న వస్తున్నట్లు ప్రకటించారు.

తండేల్ కథేంటంటే..

నాగచైతన్య- సాయి పల్లవి ప్రధాన పాత్రలలో  శ్రీకాకుళం మత్స్యకార కుటుంబంలో జ‌రిగిన కథ అధారంగా ఈ సినిమా తీస్తున్నారు. 2018లో జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమా రానుంది.  శ్రీకాకుళం సాంసృతిక, సామాజిక అంశాలతో పాటు మత్స్యకారుల జీవితాలు ఎలా ఉంటాయో ఈ సినిమాలో చూపించనున్నారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన రాజు అనే జాల‌రి   పొర‌పాటుగా పాకిస్థాన్ స‌ముద్ర‌జ‌లాల్లోకి ప్ర‌వేశించాడు. దీంతో పాక్‌ నేవి అధికారులు అరెస్ట్‌ చేస్తుంది. ఈ ఘటనను ఆధారం చేసుకుని తండేల్‌ చిత్రాన్ని నిర్మించారు. ఆ జాలరిని తిరిగి భారత్‌కు రప్పించేందుకు తన ప్రియురాలు చేసిన పోరాటం ఏంటో ఈ సినిమాలో చూడొచ్చు. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)