Breaking News

మజిలీ తర్వాత మారిపోయా.. లవ్‌స్టోరీ మిస్సవుతున్నా..: నాగచైతన్య

Published on Fri, 09/05/2025 - 11:07

అక్కినేని నాగేశ్వరరావు మనవడిగా, కింగ్‌ నాగార్జున తనయుడిగా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు నాగచైతన్య (Naga Chaitanya). జోష్‌ చిత్రంతో హీరోగా పరిచయమయ్యాడు. ఈ సినిమా వచ్చి నేటికి (సెప్టెంబర్‌ 5) 16 ఏళ్లు పూర్తవుతుంది. ఇన్నేళ్లలో ఎన్నో సక్సెస్‌ఫుల్‌ సినిమాలు చేశాడు. కొన్నిచోట్ల తడబడ్డా రెట్టింపు వేగంతో ముందుకు వచ్చి సూపర్‌ హిట్లు కొట్టాడు. తాజాగా తన జర్నీని గుర్తు చేసుకుంటూ ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.

సినిమానే నా జీవితం
ఓ ఇంటర్వ్యూలో నాగచైతన్య మాట్లాడుతూ.. వెనక్కు తిరిగి చూసుకుంటే సంతృప్తిగా ఉంది. సినిమానే నా జీవితం అని అర్థమవుతోంది. మొదట్లో ఫ్లాప్స్‌ వచ్చినప్పుడు కష్టంగా అనిపించేది. కానీ రానురానూ పరిణతి పెరిగింది. ఎదురుదెబ్బ తగిలినప్పుడు తప్పు ఎక్కడ జరిగిందని పరీశీలిస్తున్నాను. ఫలితాన్ని కాకుండా, సినిమా నుంచి వచ్చిన అనుభవంతో ముందుకు వెళ్లాలని నాన్న చెప్తూ ఉండేవారు. ఆయన మాటలు నాపై ప్రభావం చూపించాయి.

అక్కినేని ఫ్యామిలీ అంటేనే..
మజిలీ, లవ్‌స్టోరీ సినిమాలు చేశాక నా ఆలోచనా విధానమే మారిపోయింది. అక్కినేని కుటుంబం అంటేనే ప్రేమమయం. తాత మొదలుకొని మేం చేసిన ప్రేమకథా చిత్రాలను ప్రేక్షకులు ఎంతగానో ఆదరించారు. వ్యక్తిగతంగా నాక్కూడా లవ్‌ స్టోరీలంటేనే ఇష్టం. ఈ మధ్య వాటిని బాగా మిస్‌ అవుతున్నా..  ఏడాదికి రెండు మూడు సినిమాలు చేయాలనే ఆతృత కంటే కూడా ఆరునెలలు లేటైనా మంచి సినిమాతోనే రావాలనుకుంటున్నాను.

ట్రోలింగ్‌..
సోషల్‌ మీడియా అనగానే ట్రోలింగ్‌ అని చాలామంది భయపడతారు. కానీ అక్కడ మన గురించి మనం చాలా తెలుసుకోవచ్చు. నన్ను ప్రేమించేవాళ్లు, విమర్శించేవాళ్లు.. ఇద్దరూ ఉంటారు. అందరి అభిప్రాయాల్ని పరిగణనలోకి తీసుకుంటాను అని చై చెప్పుకొచ్చాడు. నాగచైతన్య ప్రస్తుతం కార్తీక్‌ దండుతో మైథలాజికల్‌ సినిమా చేస్తున్నాడు.

చదవండి: 9 వారాల వ్రతం పూర్తి చేసిన ఉపాసన.. వీడియో

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఎగ్జిబిషన్‌ మైదానంలో సందడిగా దత్తన్న అలయ్‌ బలయ్‌ (ఫొటోలు)

+5

ప్రభాస్ హీరోయిన్ కొత్త ఫొటోలు! (ఫొటోలు)