Breaking News

హ్యాపీ బర్త్‌డే లవర్‌.. శోభిత లవ్లీ విషెస్‌

Published on Sun, 11/23/2025 - 14:13

యువ సామ్రాట్‌ అక్కినేని నాగచైతన్య (Naga Chaitaya Akkineni) బర్త్‌డే నేడు (నవంబర్‌ 23). తన 39వ పుట్టినరోజు సందర్భంగా సెలబ్రిటీలు, అభిమానులు ఆయనకు సోషల్‌ మీడియా వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఆయన అర్ధాంగి, హీరోయిన్‌ శోభిత (Sobhita Dhulipala) కూడా భర్తకు ఆన్‌లైన్‌ వేదికగా బర్త్‌డే విషెస్‌ తెలియజేసింది. 

భర్తను ప్రియుడిగా..
హ్యాపీ బర్త్‌డే లవర్‌ అంటూ ఓ ఫోటో షేర్‌ చేసింది. అందులో ఫారిన్‌ వీధుల్లో చక్కర్లు కొడుతున్న ఇద్దరూ ఓ చోట ఆగిపోగా.. చై ప్రేమగా భార్యకు స్వెటర్‌ తొడిగాడు. ఇది చూసిన జనాలు భార్యంటే ఎంత ప్రేమో.. అని కామెంట్లు చేస్తున్నారు. కాగా చై జర్నీ జోష్‌తో మొదలైంది. రెండో సినిమా ఏ మాయ చేసావెతో మంచి హిట్టందుకున్నాడు. ఈ మూవీ హీరోయిన్‌ సమంతతో ప్రేమలో పడ్డాడు. ఏడేళ్లు తిరిగేసరికి పెద్దలను ఒప్పించి సామ్‌ను పెళ్లి చేసుకున్నాడు. 

పర్సనల్‌ లైఫ్‌
బయట చాలా చలాకీగా, ఖుషీగా కనిపించే ఈ జంట మధ్య రానురానూ భేదాభిప్రాయాలు మొదలయ్యాయి. దీంతో 2017లో ఇద్దరూ విడిపోతున్నట్లు ప్రకటించారు. ఆ తర్వాత చై-శోభితతో ప్రేమలో పడ్డాడు. సోషల్‌ మీడియాలో మొదలైన చాటింగ్‌ ప్రేమకు దారి తీసింది. అలా మరోసారి పెద్దలను ఒప్పించి చై-శోభిత 2024 డిసెంబర్‌లో మూడు ముళ్ల బంధంలోకి అడుగుపెట్టారు. మరోవైపు సమంత.. ఫ్యామిలీ మ్యాన్‌ దర్శకద్వయంలో ఒకరైన రాజ్‌ నిడిమోరుతో ప్రేమాయణం సాగిస్తున్నట్లు తెలుస్తోంది.

 

 

చదవండి: సినిమా కొనేందుకు డబ్బుల్లేవ్‌.. కట్‌ చేస్తే!

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)