Breaking News

ధనుష్‌కు మద్ధతుగా నిలిచిన నడిగర్‌ సంఘం

Published on Tue, 07/30/2024 - 08:57

తమిళ టాప్‌ హీరో ధనుష్‌పై తమిళ చలనచిత్ర నిర్మాతల మండలి (టీఎఫ్‌పీసీ) తీసుకున్న నిర్ణయాన్ని నడిగర్ సంఘం తప్పుపట్టింది. దీంతో కోలీవుడ్‌లో నిర్మాతలు వర్సెస్ నడిగర్ సంఘం అనేలా పెద్ద యుద్ధమే జరుగుతుంది. తాజాగా ధనుష్‌పై తమిళ నిర్మాతల మండలి పలు ఆంక్షలు విధించింది. కొత్త సినిమాలకు ధనుష్‌ని తీసుకునే ముందు, అతనికి అడ్వాన్సులు ఇచ్చిన్న పాత నిర్మాతలను సంప్రదించాలని వారు నిర్ణయం తీసుకున్నారు. దీంతో ధనుష్‌ను టార్గెట్‌ చేస్తున్నారంటూ పెద్ద ఎత్తున దుమారం రేగింది.

ధనుష్‌  అధికమొత్తంలో అడ్వాన్స్‌లు తీసుకొని ఆపై షూటింగ్స్‌కి సహకరించడంలేదని నిర్మాతలు ఆరోపిస్తున్నారు. దీంతో టీఎఫ్‌పీసీ  అభ్యంతరం తెలిపింది. ఇక నుంచి ధనుష్‌తో కొత్త సినిమాను ప్రారంభించే వారు ఎవరైనా సరే ఆ నిర్మాతలు తమిళ ఫిల్మ్‌ ప్రొడ్యూసర్‌ కౌన్సిల్‌ను సంప్రదించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇలా నిర్మాతలు ధనుషను టార్గెట్ చేయడంపై నడిగర్ సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. ధనుష్‌కు మద్ధతుగా నిలిచింది.

ధనుష్‌తో సంప్రదింపులు లేకుండానే ఇలాంటి ఆంక్షలు ఎందుకు విధిస్తారని నడిగర్‌ సంఘం ప్రశ్నించింది. అందకు పలువురు నటీనటులు కూడా ధనుష్‌కు మద్ధతు ఇస్తున్నారు. తమిళ సినిమా అభ్యున్నతి కోసం అంటూ ఆగస్ట్‌ 16 నుంచి కొత్త సినిమాల ప్రారంభాన్ని తాత్కాలికంగా నిలిపివేయాలని కౌన్సిల్‌ తీసుకున్న నిర్ణయాన్ని నడిగర్‌ సంఘం తప్పుపట్టింది. సినిమా షూటింగ్స్ నిలిపివేయాలని అనడం సరికాదని హెచ్చరించింది. నిర్మాతల నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని నడిగర్ సంఘం  డిమాండ్ చేసింది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)