Breaking News

ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌కు అదిరిపోయే అప్‌డేట్‌.. క్రేజీ కాంబో మొదలైంది!

Published on Thu, 02/20/2025 - 15:30

జూనియర్ ఎన్టీఆర్‌- ప్రశాంత్ నీల్ కాంబోలో క్రేజీ ప్రాజెక్ట్‌ను తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన అనౌన్స్‌మెంట్‌ కూడా చేశారు. ఈ చిత్రానికి డ్రాగన్ అనే టైటిల్‌ పెట్టనున్నారని టాక్ వినిపించింది. ఈ చిత్రంలో రుక్మిణీ వసంత్‌ హీరోయిన్‌గా నటిస్తారని తెలిసింది. ఈ మూవీని టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ భారీ ఎత్తున నిర్మించనుంది.

ఈ నేపథ్యంలో ప్రశాంత్ నీల్- ఎన్టీఆర్‌ మూవీకి సంబంధించి మేకర్స్ క్రేజీ అప్‌డేట్ ఇచ్చారు. ఈ యాక్షన్‌ థ్రిల్లర్ మూవీ షూటింగ్ ప్రారంభించినట్లు వెల్లడించింది. భారతీయ సినిమా చరిత్రలో రికార్డ్ సృష్టించేందుకు సమయం ఆసమన్నమైంది. ఎన్టీఆర్‌నీల్‌ షూటింగ్ అధికారికంగా ప్రారంభమైంది. ఈ సరికొత్త యాక్షన్‌ను పట్టుకోవడానికి సిద్ధంగా ఉంది అంటూ ట్వీట్ చేశారు మేకర్స్. మొదటి జనవరిలోనే షూటింగ్ ప్రారంభిస్తారని భావించినా అలా జరగలేదు. దీంతో ఈ ఫిబ్రవరిలో మ్యాన్ ఆఫ్ మాసెస్ యాక్షన్‌ మొదలైంది. కాగా.. ఈ సినిమా చిత్రీకరణ ఎక్కువగా విదేశాల్లో జరుగుతుందని, డిఫరెంట్‌ గెటప్స్‌లో ఎన్టీఆర్‌ నటిస్తారని తెలిసింది. ఈ సినిమాకు రవి బస్రూర్‌ సంగీతం అందించనున్నారు. 

 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)