Breaking News

యూట్యూబ్‌లో ఫ్రీగా ‘మిస్టరీ’

Published on Mon, 01/13/2025 - 17:04

ఓటీటీల వాడకం పెరిగిన తర్వాత ప్రేక్షకుడు థియేటర్స్‌కి వెళ్లడం తగ్గించాడు. సినిమాలో స్పెషల్‌ కంటెంట్‌ ఉంటే తప్ప థియేటర్స్‌కి వెళ్లడం లేదు. అందుకే రిలీజ్‌కు ముందే కొత్త కొత్త పంథాలో ప్రమోషన్స్‌ చేస్తూ సినిమాను జనాల్లోకి తీసుకెళ్తున్నారు. అయితే కొన్ని చిన్న చిత్రాలు బాగున్నప్పటికీ సరైన ప్రమోషన్స్‌ లేకపోవడంతో థియేటర్‌లో ఆశించిన స్థాయిలో ఆడడం లేదు. కానీ ఓటీటీలో రిలీజ్‌ అయిన తర్వాత మంచి స్పందన లభిస్తుంది.

 అందుకే కొంతమంది చిన్న నిర్మాతలు ఓటీటీ కోసమే సినిమాలను నిర్మిస్తున్నారు. అయితే ఇటీవల ఓటీటీ సంస్థలు కూడా అన్ని సినిమాలను కొనడం లేదు. ముఖ్యంగా చిన్న సినిమాల విషయంలో పరిస్థితి దారుణంగా ఉంది. థియేటర్‌లో మోస్తరుగా ఆడినా కూడా ఓటీటీకి అమ్ముడు పోవడం లేదు. అందుకే కొన్ని సినిమాలను డైరెక్టుగా యూట్యూబ్‌లో రిలీజ్‌ చేస్తున్నారు. 

ఫ్రీగా ‘మిస్టరీ’
తల్లాడ సాయి కృష్ణ దర్శకత్వం చేస్తూ నటించిన కామెడీ థ్రిల్లర్ సినిమా "మిస్టరీ". సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ సినిమాను య్యూట్యూబ్‌లో రిలీజ్‌ చేశారు. నేటి(జనవరి 13) నుంచి ఈ సినిమా యూట్యూబ్‌లో స్ట్రీమింగ్‌ అవుతోంది. తనికెళ్ళ భరణి, అలీ, సుమన్, తల్లాడ సాయికృష్ణ, స్వప్న చౌదరి, వెంకట్ దుగ్గిరెడ్డి , రవి రెడ్డి, సత్య శ్రీ, ఆకెళ్ల, గడ్డం నవీన్, శోభన్ బొగరాజు, ఎం.ఎస్ నాయుడు , లు ఇలా ప్రముఖ తారాగణం తో తెరకెక్కిన ఈ సినీమా థియేటర్లలో విడుదలైన చాలా రోజులకి ఓటీటీలోకి వచ్చేసింది. తన సినిమా యూట్యూబ్‌లో స్ట్రీమింగ్‌ అవుతున్నట్లు తల్లాడ సాయికృష్ణ సోషల్‌ మీడియా ద్వారా వెల్లడించారు.

‘మిస్టరీ’ కథేంటి?
ఒక మర్డర్ జరగడం, అసలు  ఎలా ఆ క్రైం జరిగిందీ అనే కోణం లో సినిమా మొదలు అవుతుంది.కామెడీ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో మంచి స్క్రీన్ ప్లే తో సినిమా సాగుతోంది.మల్టీ లినియర్ స్క్రీన్ ప్లే ని ఈ సినిమా కి ఉపయోగించారు. మ్యూజిక్ షాప్ మూర్తి సినిమా కి సంగీతం అందించిన పవన్ ఈ సినిమా కి బ్యాక్రౌండ్ సంగీతం అందించారు. ఒక గంట 50 నిమిషాలు నిడివిగల ఈ సినిమా సంక్రాంతి పండుగ సందర్భంగా నేటి నుంచి యూట్యూబ్‌లో స్ట్రీమింగ్‌ అవుతుందని,  సినిమా చివర వరకు ఆడియన్స్ ఎంటర్టైన్మెంట్ పొందుతారని సాయికృష్ణ అన్నారు. 

Videos

YS జగన్ విజువల్స్ @గన్నవరం ఎయిర్ పోర్ట్

తాడిపత్రిలో ఎన్నికల టెన్షన్.. YSRCP జాఫర్ ను కిడ్నాప్ చేసిన జేసీ వర్గీయులు

మైదుకూరు నామినేషన్ సెంటర్లో కి వెళ్ళి... దౌర్జన్యం చేసిన ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్

ZPTC, MPTC స్థానాలకు షెడ్యూల్

ఇక దోమల శకానికి ముగింపు.. ఏఐతో అద్భుత ఆవిష్కరణ

పులివెందులలో ఉద్రిక్తత.. అవినాష్ రెడ్డి సహా వందల మందిపై కేసులు

ప్రతి కార్యకర్త తిరగబడండి.. నిలబడండి.. YSRCP శ్రేణులకు జగన్ పిలుపు

కోలీవుడ్ డైరెక్టర్స్ వైపే చూస్తున్న టాలీవుడ్ టాప్ హీరోస్

ఆళ్లగడ్డలో ఉద్రిక్తత.. ఇద్దరు ప్రపోజర్లు కిడ్నాప్

దీపావళి తర్వాత మూతపడనున్న పెట్రోల్ బంకులు? కారణం ఇదుకే..!

Photos

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)