'వాటిని కూడా తీసుకోవాల్సిందే'.. తమన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

Published on Mon, 07/10/2023 - 18:34

టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సంగీత దర్శకుడిగా టాలీవుడ్ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. పలువురు  స్టార్ హీరోల సినిమాలకు సూపర్ హిట్స్ అందించారు. అయితే సోషల్ మీడియాలో తక్కువగా కనిపించే తమన్.. అప్పట్లో నెగెటివిటీపై చేసిన కామెంట్స్ వైరలైన సంగతి తెలిసిందే. ఆయనను తక్కువ చేస్తూ కొందరు కామెంట్స్ చేయగా.. తనదైన శైలిలో కౌంటరిచ్చారు కూడా. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న తమన్ సోషల్‌మీడియా నెగెటివిటీపై మాట్లాడారు. నెటిజన్లు ప్రశంసించినప్పుడు  ఎలా  తీసుకుంటామో.. విమర్శలు కూడా అలాగే తీసుకోవాలని అన్నారు.

(ఇది చదవండి: ఆ నలుగురు స్టార్ హీరోయిన్స్.. సినిమాలే కాదు.. ఆ రంగంలోనూ తగ్గేదేలే!)

ఓ మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు తమన్ బదులిచ్చారు. 'మీరు చెప్పింది బాగానే ఉంది కానీ, ఈ మధ్య మీపై వ్యక్తిగత దూషణకు పాల్పడుతున్నారు. క్రికెట్‌ మీద పెట్టిన శ్రద్ధ మ్యూజిక్‌పై పెట్టొచ్చుగా అని అంటున్నారు? అని అడిగారు. దీనికి కూడా తమన్‌ తనదైన శైలిలో స్పందించారు. 

తమన్ మాట్లాడుతూ.. 'నాకు ఎలాంటి వ్యసనాలూ లేవు. నాకు గర్ల్‌ఫ్రెండ్స్ కూడా లేరు. నాకు ఉన్న ఒకే ఒక్క ఎమోషన్‌ క్రికెట్‌. ప్రతిరోజూ నా ఫ్రెండ్స్‌తో రాత్రి 9 గంటల నుంచి 2 గంటల వరకూ క్రికెట్‌ ఆడి ఇంటికెళ్తా.  నా టీమ్‌ పేరు తమన్‌ హిట్టర్స్‌. మా టీమ్‌లో మ్యూజిషియన్స్‌, డ్యాన్సర్స్ కూడా‌ ఉన్నారు.. ఈ విషయంలో నేను ఎవరికీ జవాబు చెప్పాల్సిన అవసరం లేదు. అలా చేయడం వల్ల నాపై ఒత్తిడి తగ్గుతుంది.' అని అన్నారు. కాగా.. తమన్ ప్రస్తుతం మహేశ్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న గుంటూరు కారం చిత్రానికి సంగీతమందిస్తున్నారు. 

(ఇది చదవండి: ఇండియాలోనే అత్యధిక పారితోషికం తీసుకుంటున్న హీరోయిన్‌!)


    

Videos

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

Photos

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)