నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..
Breaking News
క్రికెట్ వీడియోపై నెటిజన్ వ్యంగ్య కామెంట్.. ఇచ్చిపడేసిన తమన్!
Published on Wed, 06/25/2025 - 19:54
టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ తమన్ టాలీవుడ్ బీజీఎం కింగ్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా బాలయ్య సినిమాలకు ఓ రేంజ్లో తన టాలెంట్ బయటపెడతారు. అయితే తమన్‌లో కేవలం మ్యూజిక్ మాత్రమే కాదు.. క్రికెట్లోనూ మనోడు అదరగొట్టేస్తాడు. సీసీఎల్ లీగ్‌లో తెలుగు వారియర్స్ టీమ్‌లో కీలక ప్లేయర్ కూడా. అలాంటి ఓ క్రికెట్ వీడియోను షేర్ చేస్తూ డోంట్ బౌల్ షార్ట్ బాల్ బ్రో అంటూ పోస్ట్ చేశారు.
అయితే ఈ వీడియో చూసిన ఓ నెటిజన్ తమన్‌ను ఉద్దేశించి కామెంట్ చేశాడు. షార్ట్‌కి, స్లాట్‌కి తేడా తెలియనప్పుడే నాకు అర్థమైంది.. నువ్వు ధోని ఫ్యాన్ అని అంటూ వ్యంగ్యంగా రాసుకొచ్చాడు. ఇది చూసిన తమన్ తనదైన శైలిలోనే ఇచ్చిపడేశాడు. ఓకే రా.. వచ్చి నేర్చుకుంటా.. అడ్రస్ పంపు బే.. అంటూ అదే స్టైల్లో రిప్లై ఇచ్చాడు. ఇది కాస్తా వైరల్ కావడంతో నెటిజన్స్ సైతం క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ఆ వీడియోలో తమన్ చెప్పింది కరెక్ట్ అంటూ చాలామంది పోస్టులు పెట్టారు. అనవసరంగా నువ్వే తెలియకుండా కామెంట్ చేశావంటూ అతనికి ఇచ్చి పడేస్తున్నారు.
Ok Ra Vachiii nerchukunntaaa adresss pammpu bae ! https://t.co/B0M6AGbnO7
— thaman S (@MusicThaman) June 25, 2025
Don’t bowl short bro 🤪🔥💥 !! pic.twitter.com/sIUMcd2iaY
— thaman S (@MusicThaman) June 24, 2025
Tags : 1