Breaking News

నేనేం తప్పు చేశానని..? డార్క్‌ రూమ్‌లో కూర్చుని ఏడ్చా: తమన్‌

Published on Sun, 09/28/2025 - 10:28

మ్యూజిక్‌ డైరెక్టర్‌ తమన్‌ (S Thaman).. ఇండస్ట్రీకి ఎన్నో మ్యూజికల్‌ బ్లాక్‌బస్టర్స్‌ ఇచ్చాడు. స్టార్‌ హీరోలందరి సినిమాలకు పని చేశాడు. అల వైకుంఠపురములో సినిమాకుగానూ ఉత్తమ సంగీత దర్శకుడిగా జాతీయ అవార్డు సైతం అందుకున్నాడు. తమన్‌.. చివరగా ఓజీ సినిమాకు సంగీత దర్శకుడిగా వ్యవహరించాడు. ఈ మూవీ సెప్టెంబర్‌ 25న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

నేనేం తప్పు చేశా?
ఈ సందర్భంగా తమన్‌ మాట్లాడుతూ.. 'ఓ సినిమా విషయంలో మహేశ్‌బాబు (Mahesh Babu) అభిమానులు నన్ను నానామాటలన్నారు. ఎంతో బాధపడ్డాను. నేనేం తప్పు చేశాను? మహేశ్‌బాబుగారికి నేనేం బ్యాడ్‌ మ్యూజిక్‌ ఇచ్చాను? నేను ఏ తప్పు చేయలేదే? అని డార్క్‌ రూమ్‌లో కూర్చుని ఏడ్చాను. సినిమా బాగోలేకపోతే దానికి మనమేం చేస్తాం? ఈ విషయం అభిమానులెందుకు అర్థం చేసుకోరని బాధేసింది.

అండగా ఉన్నాడు
నా బాధను అర్థం చేసుకున్న ఒకే ఒక్క వ్యక్తి దర్శకుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌. ఆరు నెలలవరకు సోషల్‌ మీడియాకు దూరంగా ఉండమన్నాడు. ఆ నెగెటివ్‌ కామెంట్లు ఏవీ చూడొద్దన్నాడు. నేను నీతో ఉన్నా.. నేను చూసుకుంటా.. నువ్వు మళ్లీ నిరూపించుకోగలవు అని ధైర్యం చెప్పాడు' అని పేర్కొన్నాడు. కాగా మహేశ్‌బాబు నటించిన బిజినెస్‌మెన్‌, ఆగడు, దూకుడు, సర్కారువారిపాట, గుంటూరు కారం చిత్రాలకు తమనే సంగీతం అందించాడు.

చదవండి: షార్ట్‌ ఫిలింస్‌ నుంచి సినిమాల్లోకి.. హార్ట్స్‌ దోచేస్తున్న తెలుగమ్మాయి

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)