Breaking News

మా సినిమాను ఆదరిస్తున్న ప్రేక్షకులకు థ్యాంక్స్‌: కోటి

Published on Sat, 09/24/2022 - 10:10

‘‘నేను ఈ రోజు ఇంత పెద్ద మ్యూజిక్‌ డైరెక్టర్‌ కావడానికి కారణమైన ప్రేక్షకులకు థ్యాంక్స్‌’’ అని సంగీత దర్శకుడు, నటుడు కోటి అన్నారు. అభిలాష్‌ సుంకర, దీపిక ఆరాధ్య జంటగా రవి శ్రీ దుర్గా ప్రసాద్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘పగ పగ పగ’. సుంకర బ్రదర్స్‌ సమర్పణలో సత్యనారాయణ సుంకర నిర్మించిన ఈ సినిమా గురువారం విడుదలైంది. శుక్రవారం జరిగిన సక్సెస్‌ మీట్‌లో కోటి మాట్లా డుతూ– ‘‘పగ పగ పగ’ సినిమాకు మ్యూజిక్‌ చేద్దామని వెళ్లాను.. అయితే దాంతోపాటు నాతో యాక్టింగ్‌ కూడా చేయించారు. మా సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది.. ఇంకా పెద్ద హిట్‌ చేయాలి’’ అన్నారు. ‘‘మా సినిమాని చూడనివారు చూసి, మమ్మల్ని ఆశీర్వదించాలి’’ అన్నారు రవి శ్రీ దుర్గా ప్రసాద్‌.

నిర్మాతలు సత్య నారాయణ  సుంకర, ఫైట్  మాస్టర్ రామ్ సుంకర మాట్లాడుతూ.. ‘మా స్టంట్‌ మాస్టర్‌ యూనియన్‌ సపోర్ట్‌ వల్లే ఈ సినిమా తీశాం. ప్రేక్షకుల స్పందన చూసి, మా కష్టం మరచిపోయాం. దర్శకుడు చెప్పిన కథ నచ్చడంతో  ఈ చిత్రం తీయడం జరిగింది.  కోటి గారితో  వర్క్ చేసే అవకాశం రావడం చాలా హ్యాపీ గా ఉంది. మా తమ్ముడు హీరోగా అద్భుతంగా నటించాడు. సీనియర్ నటుల సపోర్ట్ మరవలేనిది’అన్నారు. 

చిత్ర హీరో అభిలాష్ సుంకర మాట్లాడుతూ..  ఇప్పటివరకు ఫైటర్ గా  నేను  320 సినిమాలకు వర్క్ చేశాను. మా అన్నలు నన్ను నమ్మి నాపై ఇంత ఖర్చు పెట్టి సినిమా తీశారు. వారికి నా పాదాభివందనాలు, దర్శకులు రవి గారు మంచి కథ ఇచ్చి మమ్మల్ని  బాగా డైరెక్ట్ చేశారు. కోటి గారి మ్యూజిక్ వింటూ పెరిగిన నేను తనతో కలసి నటించడంతో పాటు, మ్యూజిక్ కూడా తనే ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది’ అన్నాడు.

Videos

భారీగా పెరుగుతున్న కరోనా, దేశంలో హైఅలర్ట్..

ప్లాప్ సినిమాకు ఎందుకంత బిల్డప్ : Perni Nani

జగన్ హయాంలో స్కాం జరగలేదని స్పష్టంగా తెలుస్తుంది: పోతిన మహేష్

తెలంగాణలో అసలైన పొలిటికల్ దెయ్యం ఎవరు..?

వంశీకి ఏమైనా జరిగితే... పేర్ని నాని మాస్ వార్నింగ్

YSR జిల్లాలో రోడ్డు ప్రమాదంపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి

జగన్ ఫోటో చూసినా మీకు భయమే కదా..!

నిర్మల్ జిల్లా కుంటాల మండల కేంద్రంలో అన్నదాతల ఆవేదన

హైదరాబాద్ లో ఉల్లి కొరత?

పవన్ కళ్యాణ్ సినిమా కోసం మంత్రి దుర్గేష్ వార్నింగ్

Photos

+5

గ్రాండ్‌గా తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరుడి కొడుకు వివాహం (ఫొటోలు)

+5

ప్రియుడి బ‌ర్త్‌డే పార్టీలో స్మృతి మంధాన! (ఫోటోలు)

+5

ఏపీలోని ఈ గుడి చాలా స్పెషల్..దట్టమైన అటవీ ప్రాంతంలో వెలసిన అమ్మవారు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : 'సల్లంగ సూడు సరస్వతమ్మా'..త్రివేణీ సంగమం భక్తజన సంద్రం (ఫొటోలు)

+5

మాదాపూర్ : హైలైఫ్ ఎగ్జిబిషలో మోడల్స్ సందడి (ఫొటోలు)

+5

ఆసక్తికరమైన ‘పైనాపిల్‌’ ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

Cannes 2025 : కాన్స్‌ రెడ్‌కార్పెట్‌పై,హొయలొలికించిన నటి ప్రణీత (ఫొటోలు)

+5

శ్రీవారితో కలిసి 14 కిలోమీటర్ల గిరిప్రదక్షిణచేసిన నటి వితికా షేరు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : సరస్వతి నది పుష్కరాలకు..పోటెత్తిన భక్తులు (ఫొటోలు)

+5

శిల్పకళా వేదిక : మిస్ వరల్డ్ టాలెంట్ గ్రాండ్ ఫినాలే..అందాల భామల సందడి (ఫొటోలు)