Breaking News

ప్రముఖ నటుడి అపహరణ.. రూ. కోటి డిమాండ్!

Published on Wed, 12/11/2024 - 13:28

ప్రముఖ బాలీవుడ్ నటుడు కిడ్నాప్‌కు గురయ్యారు.  వెల్ కమ్, స్త్రీ-2 చిత్రాలతో మెప్పించిన ముస్తాక్ ఖాన్‌ను కొంతమంది దుండగులు అపహరించారు. అతన్ని దాదాపు 12 గంటల పాటు చిత్రహింసలకు గురి చేసినట్లు తెలుస్తోంది. విడిచిపెట్టేందుకు రూ. కోటి డిమాండ్ చేసినట్లు సమాచారం. ముస్తాక్‌ ఖాన్‌ను ఈవెంట్‌కు రమ్మని కిడ్నాప్ చేశారని ఆయన సన్నిహితుడు శివమ్ యాదవ్ తెలిపారు.

అయితే ఈవెంట్‌కు హాజరయ్యేందుకు ముస్తాక్‌కు అడ్వాన్స్ ఇచ్చారని.. విమాన టిక్కెట్లు పంపించారని శివమ్ యాదవ్ వెల్లడించారు. కిడ్నాప్ చేసిన దండగులు ముస్తాక్, అతని కుమారుడి ఖాతాల నుంచి రూ.2 లక్షలు కాజేశారని తెలిపారు. కానీ చివరికీ వారి నుంచి తప్పించుకున్న ముస్తాక్‌ ఖాన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా.. ఇటీవల కమెడియన్ సునీల్ పాల్‌కు సైతం ఇదే తరహాలో కిడ్నాప్ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ముస్తాక్ బాగానే ఉన్నారని.. కొద్ది రోజుల్లోనే మీడియాతో అన్ని విషయాలు వివరిస్తారని కుటుంబ సభ్యలు వెల్లడించారు. ఈవెంట్‌ పేరుతో సెలబ్రిటీలను కిడ్నాప్ చేయడంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

 

Videos

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

Photos

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)