Breaking News

బ్లాంక్‌ చెక్‌ ఇచ్చాం.. అయినా అతడు రిజెక్ట్‌ చేశారు: మురళీ మోహన్‌

Published on Sat, 07/26/2025 - 16:11

కొత్త సినిమాలు వస్తున్నా సరే పాత చిత్రాలను ఇంకా రీరిలీజ్‌ చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే మహేశ్‌బాబు హీరోగా నటించిన క్లాసిక్‌ మూవీ అతడు (Athadu Movie Re Release)ను వచ్చే నెలలో మళ్లీ విడుదల చేస్తున్నారు. మహేశ్‌ బర్త్‌డే రోజైన ఆగస్టు 9న అతడు రీరిలీజ్‌ కానున్నట్లు ఇదివరకే ప్రకటించారు. శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ చిత్ర నిర్మాత మురళీ మోహన్‌ ఓ ఆసక్తికర విషయాన్ని చెప్పుకొచ్చారు. 

అప్పటికే సినిమాలకు దూరం..
ఈ సినిమాలో శోభన్‌బాబు నటించాల్సిందని, కానీ ఆయన రిజెక్ట్‌ చేశారని పేర్కొన్నారు. మురళీ మోహన్‌ (Murali Mohan) మాట్లాడుతూ.. అప్పటికే శోభన్‌బాబు సినిమాలు చేయడం ఆపేశారు. అతడు మూవీలో నాజర్‌ వేసిన క్యారెక్టర్‌ శోభన్‌బాబు వేస్తే బాగుంటుందనిపించింది. డైరెక్టర్‌ త్రివిక్రమ్‌తో చెప్తే అంతకంటే కావాల్సింది ఇంకేముంది? అన్నాడు. అప్పటికే మేము హైదరాబాద్‌ వచ్చేశాం. ఆయన చెన్నైలోనే ఉన్నారు. నేను నేరుగా అడగడానికి మొహమాటపడి మేకప్‌మెన్‌ రామును పిలిచాను. 

ఖాళీ చెక్‌..
ఓ బ్లాంక్‌ చెక్‌ ఇచ్చి రాముతో చెన్నై పంపించాం. రెమ్యునరేషన్‌ తనకెంత కావాలనుకుంటే అంత రాసుకోమన్నాం. దాని గురించి బేరమాడాలనుకోలేదు. ఈ క్యారెక్టర్‌ ఆయన చేస్తే ఆ పాత్రకు ప్రాముఖ్యత పెరుగుతుంది, సినిమాకు విలువ వస్తుందనుకున్నాను. కానీ శోభన్‌బాబు (Sobhan Babu) ఫోన్‌ చేసి.. సారీ, మురళీ మోహన్‌గారు, ఏమీ అనుకోవద్దు. 

హీరోగానే గుర్తుండిపోవాలి
ఎవరైనా శోభన్‌బాబు అని గుర్తు చేసుకోగానే హీరోగా అందంగా, టిప్‌టాప్‌గా కనిపించాలే తప్ప తండ్రిగా, తాతగా, రోగిష్టిగా వారికి గుర్తు రాకూడదు. అలాంటి క్యారెక్టర్లు నేను చేయదల్చుకోలేదు. మీరేం అనుకోవద్దు. ఇది కచ్చితంగా మంచి సినిమా అయ్యుంటుంది, లేకపోతే మీరు తీయరు. నాకు ఇచ్చిన పాత్ర కూడా మంచిదే అయ్యుంటుంది, లేకుంటే మీరు నన్ను అడగరు. దయచేసి ఏమీ అనుకోవద్దు. నేను చేయలేనని తిరస్కరించారు అని మురళీ మోహన్‌ చెప్పుకొచ్చారు.

చదవండి: ప్రియురాలితో ఎక్కువసేపు గడపాలనుంది: విజయ్‌ దేవరకొండ

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)