Breaking News

ఓటీటీ కంటే ముందే టీవీలోకి వచ్చేస్తున్న బ్లాక్‌బస్టర్‌ సినిమా

Published on Sun, 08/04/2024 - 15:00

బాలీవుడ్ బ్లాక్‌బ‌స్ట‌ర్ హార‌ర్ సినిమా ముంజ్యా ఓటీటీ విడుదల కంటే బుల్లితెరపైకి రానుంది. తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం ఎలాంటి అంచనాలు లేకుండా జూన్‌ 7న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కేవలం రూ. 25 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా ఇండియన్‌ బాక్సాఫీస్‌ వద్ద రూ. 140 కోట్లకు పైగానే కలెక్షన్స్‌ రాబట్టి రికార్డ్‌ క్రియేట్‌ చేసింది. మోనా సింగ్‌, శార్వరి, అభయ్‌ వర్మ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం పెద్ద సినిమాలను సైతం వెనక్కు నెట్టి బాక్సాఫీస్‌ దగ్గర సత్తా చాటింది. మ్యాడ్‌డాక్‌ సూపర్‌నేచురల్‌ యూనివర్స్‌లో ఇప్పటివరకు స్త్రీ, రూహి, భేడియా సినిమాలు రాగా ఇప్పుడు వచ్చిన ముంజా నాలుగవది. త్వరలోనే ఈ యూనివర్స్‌లో స్త్రీ 2 ఐదో సినిమాగా రాబోతోంది.

నిర్మాత‌ల‌కు భారీ లాభాల‌ను తెచ్చిపెట్టిన ముంజ్యా సినిమా ఓటీటీ కంటే ముందే టీవీల్లోకి రానుందని ప్రకటన వచ్చేసింది. స్టార్ గోల్డ్ ఛానల్‌ మంజ్యా సినిమా టెలికాస్ట్‌ గురించి ప్రకటించింది. ఆగ‌స్ట్ 24న రాత్రి ఎనిమిది గంట‌లకు బుల్లితెరపై ఈ చిత్రాన్ని చూసేయండని పేర్కొంది.

అయితే, ఇప్పటికే ముంజ్యా ఓటీటీ  హ‌క్కుల‌ను డిస్నీ ప్ల‌స్ హాట్ స్టార్ సొంతం చేసుకున్న‌ విషయం తెలిసిందే. కానీ స్ట్రీమింగ్‌ తేదీని అధికారికంగా ఇప్పటికీ కూడా ప్రకటించలేదు. స్టార్ గోల్డ్ ఛానెల్ ముందుగా ప్రకటించి ప్రేక్షకులను తమపైపు తిప్పుకుంది. దీంతో హాట్‌స్టార్‌ కూడా అలెర్ట్‌ అవుతున్నట్లు తెలుస్తోంది. ఆగ‌స్ట్ 9న ముంజ్యా చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేయాలని ఆ సంస్థ ఆలోచిస్తున్నట్లు సమాచారం.

Videos

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)