Breaking News

నా కుమారుడి కోసం సిగ్గు విడిచి డబ్బులడిగా..: కమెడియన్‌

Published on Sat, 12/07/2024 - 18:13

సామాన్యులకైనా, సెలబ్రిటీలకైనా కష్టాలు తప్పవు. బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌, కమెడియన్‌ మునావర్‌ ఫరూఖి తన జీవితంలో ఎదుర్కొన్న ఓ పెద్ద సమస్యను తాజా ఇంటర్వ్యూలో షేర్‌ చేసుకున్నాడు. మునావర్‌ మాట్లాడుతూ.. నా కొడుడు మైఖేల్‌కు ఏడాదిన్నర వయసున్నప్పుడు కవసాకి అనే అరుదైన వ్యాధి సోకింది. దీనివల్ల రక్తనాళాల్లో వాపు ఏర్పడుతుంది. 

అరగంటపాటు షాక్‌లో
అలాగే గుండెకు సైతం హాని జరిగే ప్రమాదం ఉంది. వాడి పరిస్థితి గురించి చెప్పగానే అరగంటపాటు షాక్‌లో ఉండిపోయాను. ఒక్కో ఇంజక్షన్‌ ధర రూ.25,000 ఉంటుందన్నారు. నా దగ్గర చూస్తే రూ.700 మాత్రమే ఉన్నాయి. నా గర్వాన్ని పక్కనపెట్టి ముంబై వెళ్లా.. అందరి దగ్గరా చేతులు చాచి సాయమడిగాను. ట్రీట్‌మెంట్‌కు అవసరమైన డబ్బును మూడుగంటల్లో సమకూర్చి హాస్పిటల్‌లో కట్టేశాను. కానీ ఆ డబ్బు సేకరించడం కోసం పడ్డ కష్టం, వేదన మాత్రం ఎప్పటికీ మర్చిపోలేను.

నా ముఖంలో సంతోషం లేదు
అలాగే హాస్పిటల్‌లో డబ్బు కట్టేశాక కూడా నా ముఖంలో సంతోషం లేదు. ఎందుకంటే అది నా డబ్బు కాదు కదా! ఆరోజే ఆర్థికంగా నిలదొక్కుకోవాలని ఆరోజే నిర్ణయించుకున్నాను అని చెప్పుకొచ్చాడు. కాగా మునావర్‌ గతంలో జాస్మిన్‌ను పెళ్లాడాడు. వీరికి పుట్టిన సంతానమే మైఖేల్‌. ఇటీవలే మునావర్‌.. మెజబీన్‌ కోట్‌వాలా అనే యువతిని రెండో పెళ్లి చేసుకున్నాడు.

చదవండి: పెళ్లిలో డ్యాన్స్‌.. షారూఖ్‌ ఎంత తీసుకున్నాడేంటి?

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)