Breaking News

విజయ్ దేవరకొండ 'వీడీ14'.. విలన్‌ పాత్రలో హాలీవుడ్‌ యాక్టర్!

Published on Wed, 11/26/2025 - 18:52

టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ ఈ ఏడాది కింగ్‌డమ్‌తో ప్రేక్షకులను ‍ముందుకొచ్చారు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కిన స్పై యాక్షన్‌ డ్రామా జూలైలో థియేటర్లలో విడుదలైంది. అభిమానుల భారీ అంచనాల మధ్య రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ నిరాశపరిచింది. భారీ హైప్‌ ఉన్నప్పటికీ కలెక్షన్స్ రాబట్టడంలో విఫలమైంది.

ఈ మూవీ తర్వాత విజయ్ మరోసారి రాహుల్ సాంకృత్యాన్‌తో జతకట్టారు. టాక్సీవాలా కాంబో మరోసారి ప్రేక్షకులను అలరించనుంది. వీరిద్దరి కాంబోలో వస్తోన్న మూవీకి వీడీ14 అనే వర్కింగ్ టైటిల్ ఖరారు చేశారు. ఈ చిత్రాన్ని పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌లో నిర్మిస్తున్నారు.

ఇదిలా ఉంటే వీడీ14 మూవీకి సంబంధించి ఓ టాక్ నెట్టింట వైరల్‌గా మారింది. ప్రముఖ హాలీవుడ్ యాక్టర్, మమ్మీ విలన్‌ ఆర్నాల్డ్ వోస్లూ వీడీ14లో నటించనున్నారని టాక్ వినిపిస్తోంది. ఇటీవలే మూవీ సెట్స్‌లో వినోద్ సాగర్‌తో కలిసి ఆర్నాల్డ్ వోస్లూ కనిపించడం ఈ వార్తలకు మరింత బలం చేకూరుస్తోంది. హాలీవుడ్‌ యాక్టర్‌ ఎంట్రీతో ఈ ప్రాజెక్ట్‌పై అంచనాలు మరింత పెంచేసింది. ఈ పీరియాడికల్ డ్రామాలో ది మమ్మీ స్టార్ రోల్ ఏంటో తెలుసుకోవాలని అభిమానులు ఆసక్తిగా ఉన్నారు.

ఈ స్టోరీ 1854 నాటి బ్రిటీష్ కాలం నేపథ్యంలో వస్తోన్న కథ కావడంతో వోస్లూ ఆంగ్ల అధికారి పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీలో ఆర్నాల్డ్ విలన్ పాత్ర చేయనున్నట్లు సమాచారం. అయితే ఇందులో ఆర్నాల్డ్‌ పాత్ర ఏంటనేది ఫుల్ క్లారిటీ రావాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే. కాగా.. గతంలో లైగర్‌ మూవీలో మాజీ బాక్సింగ్ ఛాంపియన్ మైక్ టైసన్ పాత్రలో ఆర్నాల్డ్ కనిపించారు. ఈ మూవీతో రెండోసారి విజయ్ దేవరకొండ సినిమాలో మమ్మీ విలన్‌ కనిపించనున్నారు.

 

Videos

సచివాలయ ఉద్యోగులంటే చంద్రబాబుకు ఎందుకింత కక్ష..?

పెళ్లి చూసుకున్నవాళ్లకే దిక్కులేదు... 15 ఏళ్ళు కలిసుంటారట..!

KAAKA నుంచి క్రేజీ అప్డేట్

ఓ బ్రాహ్మణ్ పై కక్ష్య సాధిస్తే... వేమిరెడ్డి దంపతులు ఇది నా ఆక్రందన! శ్రావణ్ శర్మ సతీమణి

సచివాలయం ఉద్యోగులను ఎలా ఈడ్చుకెళ్తున్నారో చూడండి

ఈసీ నియామక విధానంపై జగన్ ప్రశ్నలు.. అసలు వివాదం ఏంటి?

పాత అంబులెన్సుకు కొత్త రంగులు వేసిన ఏపీ సర్కారు

సిగ్గుందా చంద్రబాబు..! ఉద్యోగులంటే బానిసలనుకున్నారా..?

పోస్ట్ ఆఫీస్ అదిరిపోయే స్కీమ్.. నెలకు అకౌంట్లోకి 20,000

హిమాలయాల్లో పెను సునామీ! 200 కోట్ల మందికి డేంజర్ బెల్స్!

Photos

+5

'ప్యారడైజ్'లో కేసీఆర్‌ని పోలిన పాత్ర.. షూటింగ్‌లో ఇలా(ఫొటోలు)

+5

బర్త్‌ డే సెలబ్రేషన్స్‌ వైబ్‌లో ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి (ఫోటోలు)

+5

‘ది ప్యారడైజ్‌’లో సంపూర్ణేష్‌ బాబు భార్యగా విషిక.. గ్లామర్‌ ఫొటోలు వైరల్‌

+5

మిజ్వాన్‌ ఫ్యాషన్‌ షోలో అలియా, విక్కీ సందడి(ఫోటోలు)

+5

నాలుగు పదులు దాటినా మరింత గ్లామరస్‌గా శ్రియా శరణ్..(ఫోటోలు)

+5

ప్రీతి ముకుందన్‌ స్పెషల్‌ మూమెంట్‌ (ఫొటోలు)

+5

‘ది ప్యారడైజ్‌’ సక్సెస్‌ మీట్‌ (ఫొటోలు)

+5

‘సిగ్మా’ ప్రీ-రిలీజ్ వేడుకలో మెరిసిన ఫరియా అబ్దుల్లా (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఇంకా కొనసాగుతున్న గణేష్ నిమజ్జనాలు.. ట్యాంక్ బండ్ వద్ద భారీ క్యూ...(ఫొటోలు)

+5

చూడప్పా సిద్ధప్పా.. సింహం గడ్డం గీసేసిందప్పా! (ఫొటోలు)