Breaking News

కాల్పుల ఘటనలో సినీ నటుడు అరెస్ట్‌

Published on Sat, 01/24/2026 - 10:20

బాలీవుడ్‌ నటుడు కమల్‌ రషీద్ ఖాన్ అరెస్ట్‌ అయ్యారు.. కొద్దిరోజుల క్రితం ముంబైలో ఓ నివాసంలో కాల్పులు జరిగిన కేసులో ఆయన్ను అరెస్ట్‌ చేశారు. ఈ కాల్పులకు పాల్పడింది కమల్‌ రషీద్‌ అని పోలీసుల దర్యాప్తులో తేలినట్లు తెలుస్తోంది. దీంతో శుక్రవారం రాత్రి కమల్‌ను  అంధేరీ పోలీసులు అరెస్ట్‌ చేశారు.

కమల్ రషీద్ ఖాన్ అంటే ఎవరు గుర్తుపట్టరేమో కానీ.. కేఆర్కే అంటే వెంటనే కనిపెట్టేస్తారు. అంతలా సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యారు. స్టార్ హీరోల సినిమాలపై నెగెటివ్ రివ్యూలు ఇస్తూ హల్‌ చల్‌ చేసేవారిలో కేఆర్కే ఒకరు. తనకు తానుగా సినీ విమర్శకుడిగా ఆయన చెప్పు​కుంటారు. ఈ క్రమంలోనే పలు సినిమాల్లో కూడా నటించారు. అయితే, రచయిత-దర్శకుడు నీరజ్ కుమార్ మిశ్రా నివసించే అంధేరీలోని ఒక నివాస భవనంపై కమల్‌ రషీద్‌ నాలుగు రౌండ్ల కాల్పులు జరిపినట్లు పోలీసులు గుర్తించారు. 

జనవరి 18న తన లైసెన్స్  తుపాకీతో కాల్పులు జరిపినట్లు అతను అంగీకరించాడు. అయితే, తాను ఉద్దేశపూర్వకంగా కాల్పులు జరపలేదని.. తన గన్‌ను శుభ్రం చేసిన తర్వాత ఫారెస్ట్‌ వైపు కాల్పులు జరిపానన్నారు. పొరపాటున బుల్లెట్లు ఆ భవనం వైపు వెళ్లినట్లు ఆయన తెలిపారు. గతంలో నటుడిగా, దర్శకుడిగా పనిచేసిన ఖాన్, ఎవరికీ హాని కలిగించే ఉద్దేశ్యం తనకు లేదని విచారణలో చెప్పాడని పోలీసులు తెలిపారు. అయితే, కాల్పుల వెనుక గల ఉద్దేశ్యం ఇంకా అస్పష్టంగానే ఉంది.  అదే భవనం నాలుగో అంతస్తులో మోడల్‌ ప్రతీక్‌ నివసిస్తుండటం గమనార్హం.


 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)