Breaking News

ముమైత్‌ బ్రెయిన్‌లో ఏడు వైర్లు.. షూ లేస్‌ కట్టుకున్నా ప్రమాదమే!

Published on Wed, 04/30/2025 - 18:59

'ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే..' పాటతో ప్రేక్షకులను ఓ ఊపు ఊపేసింది ముమైత్‌ ఖాన్‌ (Mumaith Khan).. ఐటం సాంగ్స్‌కు కేరాఫ్‌ అడ్రస్‌గా మారిన ఈ బ్యూటీ తర్వాత సడన్‌గా వెండితెరకు దూరమైంది. బిగ్‌బాస్‌ షోలో పాల్గొని మళ్లీ మాయమైపోయింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో విలైక్‌ అనే అకాడమీని స్థాపించింది. దీని ద్వారా మేకప్‌కు సంబంధించిన కోర్సులను నేర్పిస్తోంది. తాజాగా ఆహాలో ప్రసారమవుతున్న కాకమ్మ కథలు గేమ్‌ షోలో పాల్గొంది. 

బ్యాంకాక్‌లో స్టంట్‌ షో..
ఈ సందర్భంగా హోస్ట్‌ తేజస్వి మదివాడ మాట్లాడుతూ.. ముమైత్‌ ఎంత బాధ అనుభవించిందో నాకు తెలుసు. తన మెదడులో ఏడెనిమిది వైర్లున్నాయి అని పేర్కొంది. అందుకు ముమైత్‌ మాట్లాడుతూ.. షూ లేస్‌ కట్టుకోవడం కూడా ప్రమాదకరం అని డాక్టర్‌ చెప్పారు. అయినా నేను బ్యాంకాక్‌కు స్టంట్‌ షో చేయడానికి వచ్చాను. అప్పుడే నేను స్వప్నదత్‌కు చెప్పాను.. రేపు ఉదయం నేను లేవకపోతే నా పని అయిపోయినట్లే అని అర్థం చేసుకోమన్నాను. అంత దారుణంగా నా పరిస్థితి ఉండేది. నా హెల్త్‌ కండీషన్‌ను అర్థం చేసుకోవడానికి రెండేళ్లు పట్టింది అని ముమైత్‌ చెప్పుకొచ్చింది.

ఇంతకీ ఏం జరిగిందంటే?
ముమైత్‌ ఖాన్‌.. ఓ రోజు తన ఇంట్లోనే కాలు జారి కింద పడింది. ఆ సమయంలో తన తల.. మంచం అంచులకు బలంగా తగిలింది. పైకి ఎటువంటి గాయం కనిపించకపోవడంతో ఆస్పత్రికి వెళ్లలేదు. కానీ తల నొప్పి తీవ్రమవడంతో ఆస్పత్రికి వెళ్లింది. మూడు రోజులుగా ఆమెకు మెదడులో అంతర్గత రక్తస్రావం జరుగుతోందని డాక్టర్లు గుర్తించి ఆపరేషన్‌ చేశారు. దాదాపు 15 రోజులపాటు ముమైత్‌ కోమాలో ఉంది. ఆ తర్వాత ఆమె ఆ గాయం నుంచి కోలుకుంది.

చదవండి: పిల్లలు పుట్టరని మధుబాలను వదిలేసిన స్టార్‌ హీరో.. చివరికేమైంది?

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)