Breaking News

స్టార్‌ హీరో సినిమా.. ఒప్పుకుని తప్పు చేశా..: ప్రముఖ విలన్‌

Published on Mon, 01/29/2024 - 15:15

ముఖేశ్‌ రిషి.. తెలుగులో ఇన్‌స్పెక్టర్‌గా మొదలుపెట్టి తర్వాత విలన్‌గా స్థిరపడిపోయాడు. ఒక్క టాలీవుడే కాదు తమిళ, మలయాళ, కన్నడ, పంజాబీ, హిందీ భాషల్లోనూ విలనిజం పండించి స్టార్‌ నటుడిగా ఎదిగాడు. చాలామందికి ఈయనను చూడగానే గుర్తొచ్చే డైలాగ్‌.. 'వీరశంకర్‌ రెడ్డి.. మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా'.. ఇంద్ర మూవీలో చిరంజీవి విలన్‌కు వార్నింగ్‌ ఇస్తూ చెప్పిన డైలాగిది! ఈ సినిమా విజయంతో ఇతడు తెలుగులో ఫుల్‌ బిజీ అయ్యాడు. సినిమాల్లో గూండాగిరి చేసే ఈయన హిందీ గూండా మూవీలోనూ దాదాగిరి చేశాడు. 1998లో రిలీజైన ఈ మూవీ అప్పుడు ఘోర పరాజయం చవిచూసింది.

ఆ సినిమా ఒప్పుకుని తప్పు చేశా..
మిథున్‌ చక్రవర్తి హీరోగా నటించిన ఈ చిత్రాన్ని ప్రేక్షకులు నిర్మొహమాటంగా తిరస్కరించారు. గూండాను ద్వేషించారు. కానీ తర్వాతి కాలంలో మాత్రం ఇది కల్ట్‌ బొమ్మగా పేరు తెచ్చుకుంది. తాజాగా ఈ సినిమా గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించాడు విలన్‌ ముఖేశ్‌ రిషి. అతడు మాట్లాడుతూ.. 'నేను గూండా సినిమా చేసిన రోజులవి.. షూటింగ్‌ మొదలైన కొన్నిరోజులకే ఈ మూవీ ఒప్పుకుని తప్పు చేశాననిపించింది. ఓ సీనియర్‌ నటుడు కూడా అలాంటి పాత్ర చేయడం అవసరమా? అని తిట్టాడు.

అప్పుడు తిట్టారు.. తర్వాత పొగిడారు
అప్పుడు నేను ఇండస్ట్రీకి కొత్తగా దొరికిన విలన్‌ను. మంచిమంచి సినిమాలు చేస్తున్నాను. అలాంటి సమయంలో గూండా సినిమా ఎలా ఒప్పుకున్నానో నాకే అర్థం కాలేదు. అప్పుడా చిత్రం ఆడలేదు.. కానీ అది విడుదలైన కొన్నేళ్లకు.. అంటే కంప్యూటర్లు నెమ్మదిగా అలవాటైతున్న రోజుల్లో జనాలు గూండాను చూశారు. మెచ్చుకున్నారు. బుల్లా(సినిమాలో పాత్ర పేరు)గా నీ క్రేజ్‌ ఎలా ఉందో తెలుసా? ఇంటర్నెట్‌లో మొత్తం నీదే హవా అని సైఫ్‌ అలీఖాన్‌ చెప్పేవరకు నాకు ఈ విషయం తెలియలేదు.

ఇప్పటికీ ఆ పాత సినిమాలు..
తర్వాత నాకు విదేశీయుల నుంచి కూడా అభినందనలు రావడం మొదలైంది. ఎక్కడికి వెళ్లినా బుల్లా డైలాగులు చెప్పమనేవారు. ఆ సినిమా చేసినప్పుడు తప్పుడు నిర్ణయం తీసుకున్నానని ఫీలయ్యాను. కానీ ఇప్పటి జనరేషన్‌కు అది ఎంతో నచ్చేసింది. 20-30 ఏళ్ల కింద రిలీజైన సినిమాలను కూడా ఇప్పుడు సెలబ్రేట్‌ చేసుకుంటున్నారు, డైలాగులు గుర్తుపెట్టుకుంటున్నారు' అని చెప్పుకొచ్చాడు ముఖేశ్‌.

చదవండి: అన్న బ్రహ్మచారి, తమ్ముడేమో రెండు పెళ్లిళ్లు.. సల్మాన్‌ రియాక్షనిదే!

Videos

వైరల్ అవుతున్న ప్రభాస్ చెల్లెల లేటెస్ట్ ఫోటోలు..

చెవిరెడ్డి పోరాటం.. నామినేషన్లు సక్సెస్

ఏపీ స్థానిక ఎన్నికలపై సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు

విజయవాడలో YSRCP ఎన్నికల ప్రచార హోరు

కడప ZP ఆఫీస్ లో నామినేషన్ల స్క్రూటినీ.. వీడియో వైరల్

మహిళలపై TDP మూకలు ఎలా దాడి చేశారో చూడండి

చింతమనేని మోసం చేశాడు.. వాపోయిన జనసేన దెందులూరు ఇంచార్జ్ వెంకటలక్ష్మి

ప్రచారంలో దూసుకుపోతున్న YSRCP వరుదు కళ్యాణి

మార్కెట్లో జియో మెగా సునామీ.. అప్లై చేసిన వారికి షేర్లు దక్కుతాయా?

ABN రాధాకృష్ణ... నీ ఫామ్ హౌస్ బాగోతం.. కారుమూరి సంచలన కామెంట్స్

Photos

+5

నిండుగా రెడీ అయిన అదాశర్మ (ఫొటోలు)

+5

ఎన్నాళ్లకెన్నాళ్లకు 'కొత్త బంగారు లోకం' బ్యూటీ ఇలా (ఫొటోలు)

+5

టాలీవుడ్ హీరోయిన్ బర్త్ డే సెలబ్రేషన్‌ (ఫొటోలు)

+5

ఏపీలో వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచార హోరు (ఫొటోలు)

+5

సందడిగా 'ఆదర్శ కుటుంబం' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

క్యూట్ నాగదుర్గ.. త్వరలో శ్రీలతగా థియేటర్లలోకి (ఫొటోలు)

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్