Breaking News

రూ.10 కోట్లు పెట్టినా రాదు: మృణాల్‌ ఠాకూర్‌

Published on Sun, 02/15/2026 - 19:04

సోషల్‌ మీడియాలో ఎక్కడ చూసినా మృణాల్‌ ఠాకూర్‌ పెళ్లి వార్తలే. వాలంటైన్స్‌ డే (ప్రేమికుల రోజు) నాడు మృణాల్‌.. హీరో ధనుష్‌ను పెళ్లాడబోతుందని తెగ ప్రచారం జరిగింది. అందులో ఏమాత్రం నిజం లేదని చెప్పినా ఎవరూ నమ్మలేదు. చివరకు వాలంటైన్స్‌ డేరోజు చడీచప్పుడు లేకపోయేసరికి ఇదంతా గాలిప్రచారమే అని తేలిపోయింది.

లైఫ్‌లో సెటిలవాలి
ప్రస్తుతం మృణాల్‌ ఠాకూర్‌ కథానాయికగా నటించిన దో దీవానే షెహర్‌ మే సినిమా రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూకు హాజరైంది. అక్కడ యాంకర్‌.. పెళ్లి గురించి ఇంట్లో ఏమైనా ఒత్తిడి ఉందా? అని ప్రశ్నించగా మృణాల్‌ ఇలా స్పందించింది. మా ఇంట్లో వాళ్లు ముందు లైఫ్‌లో సెటిలవమంటున్నారు. అటు వ్యక్తిగత జీవితాన్ని, ఇటు సినీ జీవితాన్ని బ్యాలెన్స్‌ చేసుకోవడం ఎంత కష్టమో ఇంట్లోవాళ్లకు తెలుసు.

సన్యాసి జీవితమే..
యాక్టర్‌గా ఉండటం అంటే సన్యాసిగా ఉండటంలాంటిదే! తిండి, నిద్ర.. ఇలా అన్నింటినీ వదులుకోవాలి. ఎప్పుడూ ఫోకస్‌డ్‌గా ఉండాలి. ఇప్పటివరకు నాకు ఎటువంటి పీఆర్‌ టీమ్‌ లేదు. కాకపోతే నా ఇంటి అడ్రస్‌ అందరికీ తెలుసు కాబట్టి అక్కడ పరిస్థితులు అదుపులో ఉంచేందుకు ఒక టీమ్‌ పని చేస్తుంది. బయటకు వెళ్లినప్పుడు నా సేఫ్టీ కోసం ఇంకో టీమ్‌ ఉంది. కానీ నాపై రూమర్స్‌ నాకు ఫ్రీ పబ్లిసిటీని తెచ్చిపెట్టింది. 

అందులో డౌటే లేదు
రూ.3 కోట్లు, రూ.6 కోట్లు, రూ.10 కోట్లు పెట్టినా కూడా ఇంత పబ్లిసిటీ వచ్చేది కాదు. కాకపోతే నా జీవితంలో ఏది జరిగినా అది మీ అందరితో షేర్‌ చేసుకుంటాను. అందులో డౌటే లేదు. నాపై వచ్చే రూమర్స్‌ను పట్టించుకుంటూ పోతే కెరీర్‌పై ఫోకస్‌ చేయలేను అని మృణాల్‌ చెప్పుకొచ్చింది. 'దో దీవానే షెహర్‌మే' మూవీ ఫిబ్రవరి 20న విడుదల కానుంది.

చదవండి: మెగా ఫ్యామిలీకి తొలి పెళ్లి పత్రిక.. చిరంజీవికి ఏమైంది?

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)