Breaking News

ధనుష్‌తో మృణాల్‌ ఠాకూర్‌ పెళ్లి? అసలు నిజమిదే!

Published on Sat, 01/17/2026 - 13:14

కోలీవుడ్‌ స్టార్‌ హీరో ధనుష్‌, హీరోయిన్‌ మృణాల్‌ ఠాకూర్‌ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారంటూ ఓ రూమర్‌ తెగ వైరలవుతోంది. కొంతకాలంగా ప్రేమలో ఉన్న వీరు వాలంటైన్స్‌ డే సందర్భంగా ఫిబ్రవరి 14న వైవాహిక జీవితంలో అడుగుపెట్టబోతున్నారని సోషల్‌ మీడియా కోడై కూస్తోంది. ఇది చూసిన అభిమానులు ఏంటి.. నిజమేనా? అని ఆశ్చర్యపోతున్నారు.

ఇంత సడన్‌గా పెళ్లేంటి?
అయితే ఈ ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని తెలుస్తోంది. వచ్చే నెలలో మృణాల్‌ పెళ్లి అంటూ వస్తున్న వార్తలు ఉట్టి రూమర్సేనని హీరోయిన్‌ టీమ్‌ కొట్టిపారేసింది. ఫిబ్రవరిలో ఆమె సినిమా రిలీజ్‌ ఉంది, మార్చిలో మరో తెలుగు మూవీ వస్తోంది.. సినిమాలతో అంత బిజీగా ఉంటే ఇప్పుడింత సడన్‌గా పెళ్లెందుకు చేసుకుంటుందని ఆమె టీమ్‌ తిరిగి ప్రశ్నించింది. తనకసలు ఇప్పట్లో వివాహం చేసుకోవాలన్న ఆలోచనే లేదని, అనవసరంగా దీన్ని ఎవరో సృష్టించారని చెప్తోంది. దీంతో మృణాల్‌ పెళ్లి రూమర్స్‌కు ప్రస్తుతానికి ఫుల్‌స్టాప్‌ పడ్డట్లే కనిపిస్తోంది.

సినిమా
సినిమాల విషయానికి వస్తే.. ధనుష్‌ చివరగా తేరే ఇష్క్‌ మే మూవీతో పలకరించాడు. బాక్సాఫీస్‌ వద్ద రూ.160 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి సూపర్‌ హిట్‌గా నిలిచింది. ప్రస్తుతం కార మూవీ చేస్తున్నాడు. మృణాల్‌ ఠాకూర్‌ చివరగా సన్‌ ఆఫ్‌ సర్దార్‌ మూవీతో పలకరించింది. ప్రస్తుతం హిందీలో మూడు సినిమాలు చేస్తోంది. తెలుగులో హీరోయిన్‌గా నటించిన డెకాయిట్‌ మార్చిలో విడుదల కానుంది. అల్లు అర్జున్‌- అట్లీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమాలోనూ కథానాయికగా యాక్ట్‌ చేస్తోంది.

చదవండి: నావల్లే డబ్బు పోయిందని ఇంతవరకు.. :శర్వానంద్‌

Videos

ట్రంప్ టారిఫ్ బెదిరింపు..

దొరికింది దోచుకో.. అందినంత దండుకో..!

TDP Leader: సొంత నేతలపైనే దాడులు

Ravi Teja : నా మాటవిని సినిమాలు చేయరా బాబు

సంక్రాంతి అంటేనే సంబరాల పండగ అలాంటిది చంద్రబాబు పుణ్యమా అంటూ..

CM Revanth: పాలమూరుకు అన్యాయం BRS పాలనలోనే!

Hyd: ఏటా 20 లక్షల మంది మరణించడం ఖాయం..!

Brahmanaidu: అమాయకులను కాదు.. దమ్ముంటే మమ్మల్ని చంపండి

Hyd: ఒంటరిగా వెళ్తున్న మహిళ.. రెచ్చిపోయిన ఇద్దరు యువకులు

మహిళా డాక్టర్ భర్తపై TDP ఎమ్మెల్యే బూతు పురాణం

Photos

+5

బుడ్డోడితో బీచ్‌లో బుల్లితెర నటి లహరి (ఫోటోలు)

+5

నువ్వే పెద్ద బంగారానివి! (ఫోటోలు)

+5

మిహికా: 2016.. అంతా సెల్ఫీలమయం (ఫోటోలు)

+5

‘నారీ నారీ నడుమ మురారి’ సక్సెస్‌ సెలెబ్రేషన్స్‌ (ఫోటోలు)

+5

వైభవంగా జగ్గన్నతోట ప్రభల తీర్ధ ఉత్సవాలు (చిత్రాలు)

+5

థాయ్‌లాండ్‌లో సంక్రాంతికి వస్తున్నాం బ్యూటీ బర్త్‌ డే సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

హీరోయిన్ లయ సంక్రాంతి బొమ్మల కొలువు (ఫోటోలు)

+5

సంక్రాంతి పతంగులు ఎగరేస్తోన్న అనసూయ (ఫోటోలు)

+5

సంక్రాంతి సంబురాల్లో సినీ ప్రముఖులు (ఫోటోలు)

+5

ప్రముఖ సినీ నిర్మాత 'అచ్చిరెడ్డి' బర్త్‌డే వేడుకలో సెలబ్రిటీలు (ఫోటోలు)