Breaking News

మృణాల్‌కు పెళ్లి ప్రపోజల్‌.. హీరోయిన్‌ రియాక్షన్‌ ఇదే!

Published on Tue, 02/28/2023 - 15:53

బుల్లితెరపై గుర్తింపు సంపాదించుకొని ఆ తర్వాత సినిమాల్లో క్రేజ్‌ తెచ్చుకున్న బ్యూటీ మృణాల్‌ ఠాకూర్‌. బాలీవుడ్‌లో కొన్ని సినిమాలు చేసినా సీతారామం సినిమాతోనే ఆమెకు పాపులారిటీ పెరిగింది. ఈ చిత్రంలో ఆమె అందం, అభినయానికి కుర్రకారు ఫిదా అయ్యింది. దీంతో ఆమెకు దేశవ్యాప్తంగా ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ పెరిగిపోయింది. ప్రస్తుతం మృణాల్‌ పలు సినిమాలతో బిజీగా ఉంది.

చదవండి: షాకింగ్‌ సమంతకు గాయాలు, ఫొటో వైరల్‌

ఇక తెలుగులో నాని నెక్ట్స్‌ మూవీలో ఆమె హీరోయిన్‌గా ఎంపిక అయిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే సోమవారం ట్విటర్‌ వేదికగా ఆమె ఫ్యాన్స్‌తో ముచ్చటించింది. ఈ సందర్భంగా అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు తనదైన శైలిలో సమాధానం ఇచ్చింది. ఈ క్రమంలో ఓ ఫ్యాన్స్‌ నుంచి మృణాల్‌కు షాకింగ్‌ ప్రశ్న ఎదురైంది. ఏకంగా ఓ అభిమాని పెళ్లి చేసుకుంటావా? అడిగాడు. దీనికి మృణాల్‌ ఆసక్తికర సమాధానం ఇచ్చి నెటిజన్‌కు షాకిచ్చింది. కాగా నిన్న ఆస్క్‌మీ మృణాల్‌ పేరుతో ఆమె ట్విటర్‌ వేదికగా లైవ్‌ చాట్‌ నిర్వహించింది.

చదవండి: పెళ్లయిన కొంతకాలానికే భర్త చనిపోయాడు, జీవితం తలకిందులైంది: అందాల తార రాజశ్రీ

ఈ సందర్భంగా ఓ నెటిజన్‌ ‘నా తరపు నుంచి పెళ్లి పక్కా’ అంటూ పెళ్లి ప్రపోజల్‌ తీసుకువచ్చాడు. ఇక దీనికి మృణాల్‌ స్పందిస్తూ ‘నా తరుపు నుంచి వద్దు అనుకుంటున్నా’ అని తనదైన శైలిలో సమాధానం ఇచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ట్వీట్‌ నెట్టింట వైరల్‌ అవుతోంది. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. రీసెంట్‌గా ‘సెల్ఫీ’ మూవీలో ఓ సాంగ్ చేసిన మృణాలు.. ఇషాన్ కట్టర్‌తో ఓ సినిమా, ఆదిత్య కపూర్‌తో మరో మూవీకి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. 

Videos

విద్యా శాఖ కమిషనర్ Vs ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి

ఫస్ట్ డేనే ఇంట్లో రణరంగం.. నాయకుడి కోసం పెద్ద గొడవ! రెచ్చిపోయిన రోహిత్..

రామానందనాకు బెయిల్ వస్తుందా..?

రవితేజ రేంజికి తగ్గట్టే రెమ్యునరేషన్ పారితోషికంలో మాత్రం తగ్గేదేలే!

Viral: కదులుతున్న రైలు ఎక్కబోయి.. చివరికి ఏం జరిగిందంటే?

GOLD: నిన్న, మొన్న తగ్గినదానికంటే ఇవాళ ఒక్కరోజులోనే..

Bowenpally: పొట్టు.. పొట్టు కొట్టుకున్న బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు

టెట్ అర్హత లేని టీచర్లను నియమించొద్దు సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు

జబర్దస్త్ నరేష్ జీవితంలో ఎన్నో మలుపులు.. వెనుక అసలు కథ..!

నాకు ఏం సంబంధం లేదు కన్నీళ్లు పెట్టుకున్న శ్యామ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్

Photos

+5

దువాతో రణ్‌వీర్‌ సింగ్‌, దీపికా పదుకొణె.. వైరల్‌గా ఫ్యామిలీ (ఫొటోలు)

+5

అందాల ఆషిక.. చీరలో ఆకట్టుకుందిలా..(ఫొటోలు)

+5

అబు జాని 40 సంవత్సరాల ఈవెంట్‌...మెరిసిన ప్రముఖులు (ఫొటోలు)

+5

‘ఎపిక్ ’మూవీ.. హీరోయిన్ వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మెరిసిన.. మాళవిక మోహనన్ (ఫొటోలు)

+5

నల్ల చీరలో మైమరిపించే అందంతో ప్రియా ప్రకాష్ వారియర్..(ఫొటోలు)

+5

చిన్న వయసులోనే సంచలనాలు.. కెప్టెన్‌గా ఎదిగిన గిల్ అరుదైన (ఫొటోలు)

+5

కార్తి 'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్..(ఫొటోలు)

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)