మంచి అవకాశాలు వస్తే నటిస్తా.. మిసెస్‌ సౌత్‌ ఇండియా రన్నరప్‌

Published on Mon, 01/23/2023 - 10:10

తమిళ సినిమా: మిసెస్‌ సౌత్‌ ఇండియా అందాల పోటీల్లో తమిళనాడుకు చెందిన వైశాలి.ఎస్‌ మొదటి రన్నర్‌గా కిరీటాన్ని గెలుచుకున్నారు. ఈ సందర్భంగా ఆమె శనివారం సాయంత్రం మీడియాతో ముచ్చటిస్తూ గతవారం కేరళలో పెగాసెస్‌ గ్లోబల్‌ లిమిటెడ్‌ సంస్థ మిసెస్‌ సౌత్‌ ఇండియా అందాల పోటీలను నిర్వహించిందన్నారు. ఇందులో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన 14 మంది మగువలు పాల్గొన్నారన్నారు. వారిలో తానొకరినని చెప్పారు. మూడు రౌండ్లలో జరిగిన ఈ పోటీల్లో తాను మొదటి  రన్నర్‌గా నిలిచానని పేర్కొన్నారు. అదేవిధంగా మిసెస్‌ ఇన్‌స్పౌరింగ్‌గా ఎన్నికయ్యానని తెలిపారు.

ఇది తన కెరీర్లో ఆరంభమేనని ముందు ముందు మరిన్ని అందాల పోటీల్లో పాల్గొని మిసెస్‌ ఇండియా కిరీటాన్ని దక్కించుకుంటాననే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. అందుకు తన కుటుంబ సపోర్టు ఎంతగానో ఉందని పేర్కొన్నారు. వివాహమైన ప్రతి స్త్రీ తనకంటూ ఒక గుర్తింపును పొందాలన్నారు. అందుకు తగిన ప్రయత్నాలు చేయాలని నచ్చిన రంగంలో ఇష్టమైన వృత్తిని చేపట్టాలని అన్నారు. తాను తనకు నచ్చిన రంగాన్ని ఎంచుకుని ఏదైనా సమస్యలను అధిగమిస్తూ ఈ విజయాన్ని సాధించానన్నారు. తనకు దివంగత ముఖ్యమంత్రి జయలలిత రాజకీయ జీవితం స్ఫూర్తి అని చెప్పారు.

సామాజిక స్ఫృహ అధికమన్నారు. అలా క్యాన్సర్‌ బాధితులకు కోసం తన జుట్టును దానం చేశానని, తనను స్ఫూర్తిగా తీసుకొని పలువురు తన బాటలో పయనించడం సంతోషంగా ఉందన్నారు. సినిమాల్లో నటిస్తారా అని అడుగుతున్నారని ఇటీవలే నటుడు ఉదయనిధి స్టాలిన్‌ కథానాయకుడిగా నటించిన కలగ తలైవన్‌ చిత్రంలో చిన్న పాత్ర పోషించానని, అదేవిధంగా నిమిర్దు సెల్లడా అనే షార్ట్‌ ఫిల్మ్‌లో నటించానని చెప్పారు. ఇకపై కూడా మంచి అవకాశాలు వస్తే నటిస్తానన్నారు. తన అభిమాన నటుడు రజనీకాంత్‌ అని వైశాలి పేర్కొన్నారు.

Videos

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

Photos

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)