Breaking News

మిస్టర్‌ ప్రెగ్నెంట్‌ సినిమా.. 4 రోజుల్లో ఎన్ని కోట్లు వచ్చాయంటే?

Published on Wed, 08/23/2023 - 12:39

సయ్యద్‌ సోహైల్‌ రియాన్‌.. బిగ్‌బాస్‌ తర్వాతే ఈ పేరు చాలామందికి తెలిసొచ్చింది. అప్పటికే కొత్తబంగారు లోకం, జనతా గ్యారేజ్‌ వంటి చిత్రాల్లో హీరో ఫ్రెండ్స్‌ గ్యాంగ్‌లో ఒకరిగా కనిపించిన అతడు వెండితెరపై హీరోగా రాణించే ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పటికే యురేక, లక్కీ లక్ష్మణ్‌ సినిమా చేసిన సోహైల్‌ ఇటీవలే మిస్టర్‌ ప్రెగ్నెంట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇందులో రూపా కొడువాయుర్‌ హీరోయిన్‌గా నటించింది.

ఆగస్టు 18న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రానికి ఫ్యామిలీ ఆడియన్స్‌ నుంచి మంచి స్పందన లభించింది. ఫలితంగా రోజురోజుకూ వసూళ్ల సంఖ్య పెరుగుతూ వచ్చింది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా కేవలం 4 రోజుల్లోనే రూ.4.6 కోట్లు రాబట్టింది. ఈ మేరకు చిత్రయూనిట్‌ స్పెషల్‌ పోస్టర్‌ విడుదల చేసింది. సోహైల్‌ ఎట్టకేలకు మంచి హిట్‌ కొట్టడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇక ఈ సినిమాతో శ్రీనివాస్‌ వింజనంపాటి దర్శకుడిగా పరిచయమయ్యాడు. మైక్ మూవీస్ బ్యానర్‌లో అప్పి రెడ్డి, రవీందర్ రెడ్డి సజ్జల, వెంకట్ అన్నపరెడ్డి నిర్మించారు. నిజానికి మిస్టర్‌ ప్రెగ్నెంట్‌ సినిమాను శ్రీనివాస్‌ ఎవరైనా పెద్ద హీరోతో చేయాలనుకున్నాడు. ఎందుకంటే కొత్తవాళ్లతో చేస్తే సినిమాకు క్రేజ్‌ రాదని భావించాడు. అలా తన స్నేహితుడైన సోహైల్‌ను పక్కనపెట్టాడు. కానీ అతడు బిగ్‌బాస్‌ నుంచి రాగానే నువ్వే హీరో అని చెప్పి సోహైల్‌తో సినిమా తీసి హిట్‌ కొట్టాడు. ప్రస్తుతం సోహైల్‌.. బూట్ కట్ బాలరాజుతో పాటు, కథ వేరే ఉంటది అనే సినిమా చేస్తున్నాడు.

చదవండి: బర్త్‌డే పార్టీలో డ్యాన్స్‌ చేసేదాన్ని.. ఆ డబ్బుతో పూట గడిచేది..

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)