Breaking News

అవకాశాల్లేవంటున్న బ్యూటీ.. బాస్‌ పాటతోనైనా కలిసొచ్చేనా?

Published on Fri, 08/08/2025 - 19:29

'నాగిని' సీరియల్‌తో పాపులారిటీ సంపాదించుకుంది బుల్లితెర నటి మౌనీ రాయ్‌ (Mouni Roy). బుల్లితెర నుంచి వెండితెరకు వెళ్లాలన్న ఆశ 'హీరో హిట్లర్‌ ఇన్‌ లవ్‌' అనే పంజాబీ చిత్రంతో నెరవేరింది. 'గోల్డ్‌' అనే హిందీ మూవీతో బాలీవుడ్‌లో అడుగుపెట్టింది. తొలి చిత్రానికి బెస్ట్‌ డెబ్యూగా ఫిలింఫేర్‌ అవార్డు అందుకుంది. భారీ బడ్జెట్‌ మూవీ 'బ్రహ్మాస్త్ర: పార్ట్‌ 1'లోనూ భాగమైంది. 

అంచనాలు తలకిందులు
ఈ చిత్రానికిగానూ ఉత్తమ సహాయనటిగా ఫిలింఫేర్‌, ఐఫా అవార్డులు గెలుచుకుంది. అయితే తాను ఊహించినంతగా భారీ సినిమాల అవకాశాలు మాత్రం రావడం లేదని బాధపడుతోంది. హాలీవుడ్‌ రిపోర్టర్‌ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మౌనీరాయ్‌ మాట్లాడుతూ.. బ్రహ్మాస్త్ర మూవీ తర్వాత చాలా ఆఫర్లు వస్తాయనుకున్నాను. కానీ అది నిజమవలేదు. సినిమాకు ఎవర్ని సెలక్ట్‌ చేయాలన్నప్పుడు కనీసం నా పేరు కూడా ప్రస్తావించడం లేదనుకుంటా!

ఏదో ఒక ప్రాజెక్టుతో బిజీ
అందుకు గల కారణాలేంటో తెలియడం లేదు. అయితే కెరీర్‌ మాత్రం ఆగిపోలేదు. ఓటీటీ ప్రాజెక్టులతో పాటు రియాలిటీ షో జడ్జిగా వ్యవహరిస్తూ, స్పెషల్‌ సాంగ్స్‌ చేస్తూ ఇలా ఏదో ఒకరకంగా ఎప్పుడూ బిజీగా ఉంటున్నాను. అవకాశాలు సరైన సమయంలో వాటంతటవే వస్తాయని ఎదురుచూస్తున్నాను. దాని గురించి అంతగా బాధపడుతూ కూర్చోవట్లేదు.

నా జర్నీని తక్కువ చేయలేను
ఎందుకంటే నా కెరీర్‌ ఎక్కడో మొదలై.. ఇంతదూరం వచ్చాను. ఇప్పటివరకు ఎన్నో సాధించాను. ఈ విషయంలో సంతృప్తిగా ఉండాలే తప్ప చేసిన పనిని చులకన చేసి మాట్లాడలేను. అయినా సినిమా ఫైనలైజ్‌ అవ్వాలంటే ముందు ఎన్నో ఉంటాయి. స్క్రిప్ట్‌ కుదరాలి, నిర్మాణ సంస్థలు భాగమవ్వాలి, బడ్జెట్‌ లెక్కలేసుకోవాలి. ఇలా ఎన్నో ఉంటాయి. ఇవన్నీ ఓ కొలిక్కి వచ్చాకే నటీనటుల సెలక్షన్‌ ఉంటుంది. 

విశ్వంభరతోనైనా దశ తిరిగేనా?
వాళ్లనుకునే పాత్రలో మనల్ని ఊహించుకోలేకపోతే కనీసం లుక్‌ టెస్ట్‌కు కూడా పిలవరు. కాబట్టి సినిమాలో భాగం అవడమనేది నటీనటుల చేతిలో ఉండదు అని చెప్పుకొచ్చింది. ఇకపోతే మౌనీరాయ్‌ టాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వనుందంటూ ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే! విశ్వంభర మూవీలో ఈ నటి చిరంజీవితో స్టెప్పులేసిందట! ఈ స్పెషల్‌ సాంగ్‌ షూటింగ్‌ ఇటీవలే పూర్తయింది. విశ్వంభరతోనైనా మౌనీ దశ తిరుగుతుందేమో చూడాలి!

చదవండి: 49 ఏళ్ల వయసులో సత్తా చాటిన ప్రగతి.. జాతీయ స్థాయిలో గోల్డ్‌ మెడల్‌

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)